Narayana On Bigg Boss 6 Telugu: భారతదేశంలో బిగ్ బాస్ షోని సాంప్రదాయ వాదులు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. ఆడ, మగా ఒక ఇంటిలో ఉండడం, కెమెరా ముందే ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోవడం కొందరికి నచ్చడం లేదు. భారతీయ సాంప్రదాయానికి విరుద్ధమైన ఈ షో సమాజంపై చెడు ప్రభావం చూపిస్తుందని సీపీఐ నారాయణ లాంటి రాజకీయ నాయకులు కూడా గట్టిగా వాదిస్తున్నారు.

ఫలితంగా తెలుగులో కూడా బిగ్ బాస్ షోపై వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. నిజానికి బిగ్ బాస్ సీజన్ 3కి ముందు… షో ఆపేయాలని కొందరు ఆందోళనలు చేశారు. బిగ్ బాస్ సీజన్3 హోస్ట్ నాగార్జున అని తెలుసుకున్న విద్యార్థులు ఆయన ఇంటి ముందు ఆందోళన చేయడం జరిగింది. షోను నిలిపివేయాలని కోర్ట్ లలో పిటీషన్స్ వేయడం కూడా జరిగింది.
ఎవరెన్ని చేసినా బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రస్తు బిగ్ బాస్ సీజన్ 6 కూడా నిన్న గ్రాండ్ గా మొదలు అయ్యింది. ఈ నేపథ్యంలో మళ్లీ రంగంలోకి దిగారు సీపీఐ నారాయణ. ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ ఎలా విరుచుకుపడ్డారో చూద్దాం రండి.
ఇటీవల బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ హౌస్ లోని ఇద్దరు భార్యాభర్తలైన కంటెస్టెంట్లను గట్టిగా హగ్ చేసుకొని ‘నారాయణ నారాయణ వాళ్లిద్దరూ భార్యాభర్తలు’ అంటూ కౌంటర్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ అని.. అక్కడికి వెళ్లినవారు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్లు అని.. నాగార్జున డబ్బు కోసం గడ్డి తింటున్నాడని ఇటీవల సీపీఐ నారాయణ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై బిగ్ బాస్ ప్రేమికులు, మాజీ కంటెస్టెంట్లు విరుచుకుపడుతున్నారు.

నాగార్జున బిగ్ బాస్ లో నారాయణకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.. ‘నారాయణ.. నారాయణ వాళ్లు మ్యారీడ్’ అంటూ ఎద్దేవా చేశాడు. దీనికి నారాయణ తాజాగా స్పందించారు. ‘నాగన్నా.. నాగన్న..’ అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తూ వీడియో వదిలారు. ‘బిగ్ బాస్ హౌస్ లో పెళ్లైన జంటకు లైసెన్స్ ఇచ్చి శోభనం గది ఏర్పాటు చేశారన్నా.. మరి మిగతా వాళ్లకు ఏం చేశారు? వాళ్లకేం పెళ్లిళ్లు కాలేదు కదా? వాళ్లేం బంధువులు కాదు కదా? మరి వాళ్లేం అయ్యారు? వందరోజుల పాటు వాళ్లేం చేస్తారో అది కూడా చెప్పన్నా.. నాగన్నా.. నాగన్నా ఈ బిగ్ బాస్ షోలో’ అంటూ సీపీఐ నారాయణ కౌంటర్ ఇచ్చాడు.