spot_img
Homeఎంటర్టైన్మెంట్Rajamouli: మహేశ్‌ సినిమా పై రాజమౌళి క్రేజీ కామెంట్స్.. ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఓ...

Rajamouli: మహేశ్‌ సినిమా పై రాజమౌళి క్రేజీ కామెంట్స్.. ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఓ సాహసికుడి కథ

Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి చేయబోతున్న పాన్ ఇండియా సినిమా పై తాజాగా రాజమౌళి క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు. అసలు కొన్ని కాంబినేషన్లు చూడటానికి ప్రేక్షకులు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తారు. అలాంటి కలయికే జక్కన్న – మహేష్ లది. నిజానికీ ఈ కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సింది. కానీ, ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాకి రంగం సిద్ధం అయ్యింది. ఇంతకీ రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి ఇచ్చిన అప్ డేట్ ఏమిటి అని తెలుసుకోవాలనేగా మీరు ఆసక్తిగా ఉన్నారు. అయితే కింది పేరా చదివి తెలుసుకోండి.

Rajamouli
Rajamouli, mahesh babu

రాజమౌళి టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రాజమౌళి అక్కడ మహేష్ తో చేయబోయే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటో రాజమౌళి మాటల్లోనే.. ‘మహేష్ తో చేయబోతున్న సినిమా కథ విషయానికి వస్తే.. అది ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఓ సాహసికుడి కథ’ అని, ఇదొక యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ అని రాజమౌళి తెలిపారు.

మరోపక్క రాజమౌళితో కలిసి పని చేయడం పై ఇటు మహేశ్‌ బాబు కూడా తన స్పందన తెలియజేశాడు. ‘రాజమౌళి గారితో పనిచేయాలన్న నా కల ఇప్పుడు సాకారం కాబోతోంది. రాజమౌళి గారితో ఒక సినిమా చేస్తే, 25 సినిమాలు చేసినట్టే. అందుకే.. ఆయనతో చేయబోయే సినిమా విషయంలో నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఇది పాన్‌ ఇండియా సినిమా అవుతుంది’ అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు.

విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా కథను ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో రాశారు. ఆ ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుంది. అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారు. ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి.. ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారు. క్లుప్తంగా చెప్పుకుంటే ఈ సినిమా కథ ఇదే.

Rajamouli
Rajamouli, mahesh babu

కాకపోతే.. ఫారెస్ట్‌ లో జరిగే యాక్షన్‌ ఎడ్వెంచరెస్‌ సీన్లు అద్భుతంగా ఉంటాయట. ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో రాజమౌళి ని మించినోళ్ళు లేరు. కాబట్టి.. సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యం ఇండియన్ సినిమాకి పూర్తిగా కొత్త నేపథ్యం. ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో ఆ నేపథ్యంలో సినిమా రాలేదు. ఇప్పుడు మహేష్ చేస్తే.. కచ్చితంగా ఇండియా వైడ్ గా ఈ సినిమా పై ఆసక్తి ఉంటుంది.

అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఎప్పటిలాగే రాజమౌళి ఈ సినిమాని నేషనల్ వైడ్ గా భారీ సినిమాగా ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి హీరో అంటేనే.. మాస్ కి పరాకాష్ట. అందుకు తగ్గట్టుగానే హీరో లుక్ ను రాజమౌళి డిజైన్ చేస్తాడు. ఈ క్రమంలోనే మహేష్ లుక్ కోసం జక్కన్న ప్రత్యేక కసరత్తులు చేశాడు. గతంలో ఏ సినిమాలో కనిపించని విధంగా మహేష్ ఈ సినిమాలో కనిపిస్తాడట.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Oktelugu Epaper
Exit mobile version