Nara Lokesh Support: మరో నాలుగు రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద కనీవినీ ఎరుగని పోరు ని చూడబోతున్నాము. ఒకపక్క ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) విడుదల అవ్వబోతుంటే, మరో పక్క సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth), లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం విడుదల అవ్వబోతుంది. రెండు కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలే. భారీ తారాగణంతో తెరకెక్కిన సినిమాలు అనొచ్చు. ఈ రెండు చిత్రాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కాసేపు పక్కన పెడితే, నేడు ఉదయం ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ పెను దుమారమే రేపింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ట్వీట్ పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ లో స్పేస్ పెట్టి మరీ లోకేష్(Nara Lokesh), బాలకృష్ణ(Nandamuri Balakrishna) లను బూతులు తిడుతున్నారు. ఇంతకీ అసలు ఏమైందో ఒకసారి చూద్దాం.
నారాలోకేష్ మాట్లాడుతూ ‘రజనీకాంత్ సార్ 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ లో తన ప్రయాణం ని పూర్తి చేసుకున్నారు. మనమంతా ఆయన బాక్స్ ఆఫీస్ ని రూలింగ్ చేస్తున్న సమయం లో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. అంతే కాకుండా కష్టసమయం లో మా కుటుంబానికి ఆయన అండగా నిల్చిన తీరుని ఎప్పటికీ మరచిపోలేము. కూలీ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇందులో తప్పేమి ఉంది, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు ట్రిగ్గర్ అయ్యారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సినిమా విడుదలయ్యే రోజే ఎన్టీఆర్ విలన్ క్యారక్టర్ చేసిన ‘వార్ 2’ కూడా విడుదల కాబోతుంది. ఆ సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోగా, దానికి పోటీగా వస్తున్న సినిమా గురించి మాట్లాడడమే ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పించిన పాయింట్. మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపం తో చేస్తున్న కామెంట్స్ పై కూడా టీడీపీ పార్టీ శ్రేణులు బలంగా తిప్పి కొడుతున్నారు.
మరి ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి సినిమా విడుదల అవుతున్నప్పుడు అవతల హీరో సినిమా గురించి మాట్లాడితే ఆ మాత్రం కోపం రావడం న్యాయం ఉంది. కానీ నారాలోకేష్ రజనీకాంత్ కి సపోర్టుగా నిలబడడంలో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయిన సమయం లో జూనియర్ ఎన్టీఆర్ కనీసం సంఘీభావం గా ఒక ట్వీట్ కూడా వెయ్యలేదు. అలాంటి సమయంలో రజనీకాంత్ కూడా సపోర్టుగా నిలిచాడు. మరి న్యాయంగా చూసుకుంటే ఆయనకే కదా ముందుగా మద్దతు తెలపాలి అనేది కొందరి వాదన. ఏది ఏమైనా ఈ వ్యవహారం పై ట్విట్టర్ లో ఇప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రేపు లేదా ఎల్లుండి నారా లోకేష్ ‘వార్ 2’ పై కూడా ట్వీట్ వేస్తాడో లేదో చూడాలి.