spot_img
Homeఎంటర్టైన్మెంట్Nani The Paradise release delayed: మరోసారి వాయిదా పడిన నాని 'ది ప్యారడైజ్'.. అసలు...

Nani The Paradise release delayed: మరోసారి వాయిదా పడిన నాని ‘ది ప్యారడైజ్’.. అసలు ఏమి జరుగుతుందో అర్థం అవ్వడంలేదు..

Nani The Paradise release delayed: స్టార్ హీరోలు సంవత్సరాల తరబడి సినిమాలు చేయడం వల్ల, ఇండస్ట్రీ మనుగత ప్రస్తుతానికి కష్టంగా మారింది. ముందు తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్ వంటి వారు సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తుండడం వల్ల , బాక్స్ ఆఫీస్ కలకలలాడుతూ ఉండేది. కానీ ఇప్పటి స్టార్ హీరోల నుండి అలా వరుస సినిమాలు రావడం లేదు. ఒకవేళ వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ లాగా నిలుస్తున్నాయి. స్టార్ హీరోల సంగతి కాసేపు పక్కన పెడితే , మీడియం రేంజ్ హీరోలు కూడా ఇప్పుడు ఒక్క సినిమా విడుదల చేయడానికి నానా తిప్పలు పడుతున్నారు. నేచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం పరిస్థితి ఇలాగే తయారైంది. ‘దసరా’ వంటి భారీ బ్లాక్ బస్టర్ ని అందించిన శ్రీకాంత్ ఓదెల తో కలిసి ఆయన చేస్తున్న రెండవ చిత్రమిది.

మొదటి నుండి ఈ చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి , ఇక రీసెంట్ గా విడుదలైన చేసిన ‘ఆయా షేర్’ పాటతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒక స్టార్ హీరో భారీ హైప్ సినిమాకు మార్కెట్ లో ఎలాంటి బజ్ ఉంటుందో , ఈ చిత్రానికి కూడా అదే రేంజ్ బజ్ ఉంది. అయితే షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ వస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఆగష్టు 21 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీన కూడా ఈ చిత్రం విడుదల అవ్వడం దాదాపుగా అసాధ్యం అని తెలుస్తోంది. అందుకు ముఖ్య కారణం షూటింగ్ పూర్తి అవ్వకపోవడమే. అంతే కాకుండా రీ షూట్స్ కూడా బాగా ఎక్కువ అయ్యాయి అట.

నాని డైరెక్టర్ పని తీరుపట్ల అసహనం కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తే ఎలా ఉండుందని ఆలోచిస్తున్నారట మేకర్స్. డిసెంబర్ ప్రారంభం లో కానీ , లేదంటే క్రిస్మస్ కానుకగా కానీ , ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ బయటకు రానుంది. ఒక బలమైన బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా, ఆన్ లొకేషన్ లో సినిమాలకు సంబంధించిన సన్నివేశాలు , డైలాగ్స్ రాసుకునే పరిస్థితి వశే ఇలాగె ఉంటుందని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అదే చేస్తున్నాడని రానున్నారు. బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది. చెరుకూరి సుధాకర్ తో పాటు నాని కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Telugu Heroes: సక్సెసులు లేని హీరోలకు ఈ ఇయర్ బాగా కలిసి వస్తుందిగా…

Telugu Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎప్పటికప్పుడు సక్సెస్ లను సాధిస్తుండాలి. లేకపోతే మాత్రం వాళ్ల మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదమైతే ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ లు...

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Oktelugu Epaper
Exit mobile version