Serbia Gen Z Protest: రైల్వే స్టేషన్ పైకప్పు కూలింది. 16 మంది చనిపోయారు. ఇది జరగడానికి ప్రధాన కారణం అవినీతి. అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన మొదలైంది. అది దేశవ్యాప్త ఉద్యమానికి దారి తీసింది. ప్రధాని రాజీనామా నుంచి.. ఎన్నికలలో అధికార మార్పు వరకు సాగిన ప్రయాణం అత్యంత సంచలనంగా మారింది.
ఆ మూడు దేశాల సరసన
శ్రీలంక.. బంగ్లాదేశ్.. నేపాల్.. ఇలా మూడు దేశాలలో యువతరం కదం తొక్కడంతో అక్కడ ప్రభుత్వాలు మారిపోయాయి. ఇప్పుడు ఈ మూడు దేశాల సరసన సెర్బియా కూడా చేరింది. సెర్బియా యూరప్ ఖండంలో ఒక దేశం. వాస్తవానికి యూరప్ లో ఉద్యమాలు జరుగుతున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా.. అణిచివేతకు వ్యతిరేకంగా.. పోరాటాలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగానే యూరప్ లోని సెర్బియా దేశంలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది.. అవినీతి.. ప్రభుత్వ జవాబుదారితనం.. ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై ప్రశ్నలు వ్యక్తం చేస్తూ విద్యార్థులు ఉద్యమం మొదలుపెట్టారు. చివరికి అధికార రాజకీయాలను మార్చే స్థాయికి ఉద్యమాన్ని తీసుకువెళ్లారు. 2024 నవంబర్లో ఒక రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం ఈ ఉద్యమానికి తక్షణ కారణం. యువతలో పేరుకుపోయిన అసంతృప్తి దానికి విస్తృతమైన మద్దతును ఇచ్చింది.
ప్రధాని రాజీనామా
2025 జనవరిలో అప్పటి ప్రధాని మీలోష్ ఉచేచివ్ రాజీనామా చేశారు. అదే ఏడాది ఏప్రిల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయినప్పటికీ విద్యార్థుల ఆందోళన ఆగలేదు. ముందస్తు ఎన్నికలు.. పారదర్శకత.. అవినీతి పై చర్యలు అనే డిమాండ్లతో ఉద్యమం మళ్లీ మొదలైంది. ఈ ఏడాది అక్టోబర్ 25న వెలుబడిన ఎన్నికల పరిణామాలు ఈ పోరాటానికి మరో కీలక మలుపుగా నిలిచాయి. విద్యార్థుల సపోర్ట్ తో పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు . దీర్ఘకాలం అధికారంలో ఉన్న అలెగ్జాండర్ వుచిచ్ ఓటమిని అంగీకరించారు.
ఉద్యమం ఎందుకు మొదలైంది..
సెబియాలో జెన్ జెడ్ ఉద్యమానికి మూలం 2024 నవంబర్ 1న జరిగిన ఒక విషాద ఘటన. దేశంలోనే రెండవ అతిపెద్ద నగరమైన నోవి సాడ్ లో రైల్వే స్టేషన్ పునరుద్ధరణ అనంతరం కాంక్రీట్ పై కప్పు అంచు కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా పునరుద్ధరించిన రైల్వే స్టేషన్లోనే ఇంత ఘోర ప్రమాదం జరగడం ప్రజలను తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. నిర్మాణ నాణ్యత.. పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ.. ప్రభుత్వ అధికారుల బాధ్యతలపై ప్రశ్నలు వ్యక్తం అయ్యాయి. ఈ ప్రమాదానికి అవినీతి.. నిర్లక్ష్యం కారణమని నిరసనకారులు ఆరోపించారు. ప్రమాదంపై పారదర్శకమైన విచారణ జరపాలని.. నిర్మాణానికి సంబంధించిన పూర్తి పత్రాలను బయటపెట్టాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేశారు. మొదట స్థానికంగా మొదలైన నిరసనలు క్రమంగా.. బెల్ గ్రేడ్ సహ ఇతర నగరాలకు విస్తరించాయి.
విద్యార్థుల చేతుల్లోకి
ఈ ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలకు దిగారు. 2024 నవంబర్ చివరి వారంలో బెల్ గ్రేడ్ లోని ఫ్యాకల్టీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ వద్ద నిరసన తెలిపారు. ఆ సమయంలో విద్యార్థులపై దాడి జరిగింది. ఇది ఉద్యమానికి మరో మలుపుగా మారింది. విద్యార్థులు తమ విద్యా సంస్థల్లో బ్లాకెడ్లు చేపట్టి డిమాండ్ నెరవేరేవరకు ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. ఆ తర్వాత నోవి సాడ్,బెల్ గ్రేడ్, క్రగుయో వాక్ వంటి నగరాలలో విశ్వవిద్యాలయాలకు ఈ నిరసనలు వ్యాపించాయి. విద్యార్థులు తరగతులను బహిష్కరించి.. విశ్వవిద్యాలయ భవనాలను నిరసన కేంద్రాలుగా మార్చారు. రోడ్లపై ర్యాలీలు చేశారు. ట్రాఫిక్ ను దిగ్బందించారు. మౌన ప్రదర్శనలు చేపట్టారు.
సోషల్ మీడియాను వాడుకున్నారు
ఈ ఉద్యమాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకురడానికి యువతరం సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకుని. నిరసనల సమాచారం.. విద్యార్థుల డిమాండ్లు.. ర్యాలీల వివరాలను ఆన్లైన్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. ఉద్యమంలో ఒక నాయకుడు మీద ఆధారపడకుండా.. వివిధ విద్యార్థి బృందాలు సమావేశం నిర్వహించి.. నిర్ణయాలు తీసుకున్నాయి. విద్యార్థుల ఉద్యమాలకు సమాజంలో అన్ని వర్గాలు సపోర్ట్ చేశారు. ఫలితంగా ఉద్యమం కేవలం విద్యార్థుల సమస్యగా మాత్రమే కాకుండా.. ప్రభుత్వం నుంచి జవాబుదారితనం కావాలని విస్తృతమైన చర్చను దేశవ్యాప్తంగా తీసుకువచ్చింది. ఉద్యమకారుడు ఎరుపు రంగులో చేతి ముద్రలను ప్రదర్శించడం కూడా ఉద్యమానికి గుర్తుగా నిలిచింది.
ప్రభుత్వంపై తీవ్ర ఒత్తడి
నిరసనలు విస్తరిస్తున్న సమయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగింది. గత ఏడాది జనవరి 27న బెల్ గ్రేడ్ లో విద్యార్థులు రహదారి కూడలిని దిగ్బందించారు. ఆ తర్వాత రోజు అప్పటి ప్రధాని మీలోష్ రాజీనామా చేస్తున్న ప్రకటించారు.. నోవి సాడ్ తన మేయర్ పదవికి రాజీనామా చేశారు.. ఆ తర్వాత ఏప్రిల్ 16న దూరో మచ్ ప్రధానిగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే ప్రధాని మార్పు వల్ల సమస్య పరిష్కారమైందని విద్యార్థులు భావించలేదు.. ప్రభుత్వం నిర్ణయాలలో పారదర్శకత ఉండాలని.. ప్రజా నిధుల వినియోగంపై జవాబుదారితనం.. స్వతంత్ర దర్యాప్తు.. ప్రజా సంస్థల పనితీరు మెరుదల వంటి అంశాలను విద్యార్థులు పాల్గొన్నారు. దీంతో నిరసనలు అదేవిధంగా కొనసాగాయి..
విద్యార్థుల భారీ ప్రదర్శన
గత ఏడాది మార్చిలో బెల్ గ్రేడ్ లో విద్యార్థులు భారీ ప్రదర్శన చేయడంతో ఉద్యమం స్థాయి ఎలా ఉందో అందరికీ అర్థమైంది. సుమారు రెండు సంవత్సరాల పాటు జరిగిన నిరసనల తర్వాత అక్టోబర్ 25న జరిగిన ఎన్నికలు సెర్బియా రాజకీయాల్లో కీలకమైన పరిణామానికి నాంది పలికాయి. విద్యార్థుల సపోర్టుతో బరులకు దిగిన అభ్యర్థుల జాబితా విజయాన్ని అందుకుంది. దీర్ఘకాలంగా సెర్బియా రాజకీయాలలో ఆధిపత్యం కొనసాగించిన అలెగ్జాండర్ కూటమిని అంగీకరించారు. ఈ పరిణామం విద్యార్థుల ఉద్యమం వీధి నిరసనలకే పరిమితం కాకుండా.. ఎన్నికల రాజకీయాలపై కూడా ప్రభావం చూపగలదని అర్థమైంది. విద్యార్థుల సపోర్టుతో ఎన్నికైన ప్రతినిధులు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు.. వారి వాగ్దానాలను ఎలా అమలు చేస్తారు.. పరిపాలనలో ఎలాంటి మార్పులు తీసుకొస్తారు.. అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.