
దిల్ రాజు నిర్మాతగా నాని హీరో గా రూపొందిన ‘వి’ ..చిత్రం ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఈ చిత్రం తరువాత నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా చేయవలసి వుంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగు ఇంకా మొదలు కాలేదు .
ఉద్యోగాలు పోతాయని 86 శాతం భారతీయుల భయం!
కాగా ఇపుడు ఇంకో కొత్త చిత్రాన్ని కూడా నాని లైన్లో పెట్టడంజరిగింది . దర్శకుడు వివేక్ ఆత్రేయకి నాని సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. 2019 లో సక్సెస్ సాధించిన అతి తక్కువ చిత్రాల్లో ‘బ్రోచేవారెవరురా’ ఒకటి. ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. అలాంటి దర్శకుడు వివేక్ ఆత్రేయ వినిపించిన కథ నచ్చడంతో నాని వెంటనే ఓకే చెప్పేశాడట. ‘బ్రోచేవారెవరురా’ తరహాలోనే ఈ సినిమా కూడా పూర్తి వినోదభరితంగా సాగుతుందని తెలుస్తోంది. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమాలో మిగతా తారాగణం ఇంకా ఫైనల్ కాలేదట…కాగా లాక్ డౌన్ ఎత్తేసాక ఒక వైపున ‘శ్యామ్ సింగ రాయ్’ చేస్తూనే , మరో వైపున వివేక్ ఆత్రేయ సినిమాను పూర్తి చేయాలన్నది నాని ఆలోచనగా తెలుస్తోంది .