The Paradise Movie : ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’ ఇలా వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందుకొని తన బ్రాండ్ ఇమేజ్ ని స్టార్ హీరో రేంజ్ కి తీసుకెళ్లిన నేచురల్ స్టార్ నాని(Natural Star Nani), ఇప్పుడు ‘ప్యారడైజ్'(The Paradise Movie) చిత్రం తో తన రేంజ్ ని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభం లో ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి గ్లింప్స్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. నాని ఇప్పటి వరకు ఆడియన్స్ ఎవ్వరూ చూడని కాన్సెప్ట్ తో రాబోతున్నాడు, ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడు అంటూ విమర్శకులు కూడా ప్రశంసించారు. వచ్చే ఏడాది మార్చి 26 న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఈ చిత్రం లో ఆయన హీరో గా నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇన్ని రోజులు నిర్మాతగా మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు చేస్తూ , వరుస విజయాలను అందుకుంటూ వచ్చిన నాని, ఈ సినిమాతో తొలిసారిగా భారీ బడ్జెట్ ని ఖర్చు చేసేందుకు ధైర్యం చేసాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం చూస్తుంటే, ఈ సినిమా షూటింగ్ స్మూత్ గా సాగడం లేదని తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల అనుకున్న సమయానికి ప్రోడక్ట్ ని డెలివరీ చేయలేకపోతున్నాడట. ఎందుకంటే ఆయన కోరుకునేవి చాలా పెద్ద రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే తన మార్కెట్ కి రెండింతలు ఎక్కువ బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నాడు నాని. కానీ శ్రీకాంత్ రోజురోజుకి డిమాండ్ చేసేవి చూస్తుంటే ఒక పాన్ ఇండియన్ సూపర్ స్టార్ సినిమాకు అయ్యేంత ఖర్చు కనిపిస్తుందట. నాని కి అంత బడ్జెట్ ఖర్చు చేయడం ఇష్టం లేదు.
ఈ విషయం లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నాని కి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగిందని, అందుకే గత మూడు రోజులుగా షూటింగ్ ఆగిపోయిందని అంటున్నారు. అయితే నాని ఒక్క షరతు మీద శ్రీకాంత్ అడిగిన బడ్జెట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ షరతు ఏమిటంటే సినిమాని ఎట్టిపరిస్థితిలోనూ రానున్న 35 రోజుల్లో పూర్తి చెయ్యాలి. లేదంటే ఈ చిత్రాన్ని ఇక్కడితో ఆపేద్దాం అని అన్నాడట నాని. మరి ఏమి జరగబోతుందో చూడాలి. ఈ సినిమాకే ఇన్ని సమస్యలు ఎదురైతే, ఇక మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ సినిమాకు ఎంత బడ్జెట్ ఖర్చు అవబోతుందో అని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా నానినే నిర్మించబోతున్నాడు. ‘ది ప్యారడైజ్’ పూర్తి అవ్వగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.