Nani: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన హీరో నాని, నేడు ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన స్థాయిని, తన సినిమాల పరిధిని, మార్కెట్ ని పెంచుకుంటూ ముందుకు పోతూనే ఉన్నాడు. ‘దసరా’ చిత్రం తో 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన నాని, ఈసారి ‘సరిపోదా శనివారం’ చిత్రంతో వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కొల్లగొట్టేందుకు సిద్ధం అయ్యాడు. ఒక సాధనరణమైన కుర్రాడు, ఇప్పుడు ఉన్నటువంటి విపరీతమైన పోటీ వాతావరణంలో ఎవరి సపోర్టు లేకుండా ఇంత దూరం రావడం అనేది చిన్న విషయం కాదు. అర్బన్ సెంటర్స్ మరియు ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో నాని ఇప్పటికే స్టార్ హీరోలతో సరిసమానం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టడానికి ఆయన కేవలం ఒక్క హిట్ దూరంలో మాత్రమే ఉన్నాడు.
ఇదంతా పక్కన పెడితే నాని ఒక్క భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాని చేతులారా మిస్ చేసుకున్నాడు అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే డైరెక్టర్ ‘హను రాఘవపూడి’ నాని కోసం ఒక పీరియడ్ లవ్ స్టోరీ ని తయారు చేసాడు. స్వాతంత్రం రాకముందు ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కి, పాకిస్థాన్ అమ్మాయికి మధ్య జరిగిన ఒక ప్రేమ కథ ఇది. ఈ ఆలోచన డైరెక్టర్ హను నాని కి చెప్పిన వెంటనే ఆయనకి తెగ నచ్చేసింది. స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని తీసుకునిరా అని నాని డైరెక్టర్ హను కి చెప్పాడు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ అనే చిత్రం తెరకెక్కి మంచి హిట్ అయ్యింది. తనతో ఒకసారి పనిచేసిన దర్శకులతో మరో సినిమా చెయ్యడం నాని కి అలవాటు, అదే విధంగా హను కి కూడా ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ లవ్ స్టోరీ స్క్రిప్ట్ ని రాస్తున్నప్పుడు దాని పరిధి బాగా పెరిగిపోయింది. ఈ స్క్రిప్ట్ ని అనుకున్న విధంగా తియ్యాలంటే కచ్చితంగా భారీ బడ్జెట్ అవుతుంది. అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా అయితే ప్రభాస్ తో తియ్యడమే కరెక్ట్ అని భావించి, ప్రభాస్ కి ఈ కథని చెప్పి ఓకే చేసుకున్నాడు హను.
రీసెంట్ గానే ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కొద్దిరోజుల్లోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. అయితే తనతో చెయ్యాల్సిన సినిమా, వేరే హీరోతో చేసే విషయం నాని కి ముందుగా హను చెప్పాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకప్పుడు నాని మార్కెట్ కి ఇంత బడ్జెట్ సినిమా వర్కౌట్ అయ్యేది కాదేమో కానీ, ఇప్పుడు ఆయన రేంజ్ ని సినిమా సినిమాకి పెంచుకుంటూ పోతున్నాడు, అయినప్పటికీ కూడా హను నాని మీద ఎందుకు రిస్క్ చెయ్యలేదు అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.