Nani : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit : The Third Case) మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ , ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను ఏర్పడేలా చేసింది. నాని కెరీర్ లోనే కాదు , టాలీవుడ్ లోనే ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు ఇప్పటి వరకు చూడలేదు అంటూ ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాని స్పీచ్ చూసిన తర్వాత కచ్చితంగా ఈ చిత్రం కుంభస్థలం బద్దలు కొడుతుంది అని చెప్తున్నారు అభిమానులు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి(SS Rajamouli) ముఖ్య అతిధి గా విచ్చేశాడు. ఆయన్ని ఉద్దేశించి నాని మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : రెట్రో’ ని డబుల్ మార్జిన్ తో డామినేట్ చేస్తున్న ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్!
ఆయన మాట్లాడుతూ ‘మొదటి నుండి నాకు రాజమౌళి గారిని ప్రసాద్ ల్యాబ్స్ లో చూస్తేనే నాకు సంతృప్తి గా ఉంటుంది. ఆయన నా సినిమా చూసి ప్రేమతో కౌగలించుకొని వెళ్ళిపోతే సినిమా బాగాలేదు అన్నట్టు, అలా కాకుండా ఆయన నా సినిమా చూసి మనస్ఫూర్తిగా మెచ్చుకుంటే అప్పుడు సినిమా బాగున్నట్టు. రాజమౌళి గారిని ప్రతీ ఒక్కరు కుటుంబ సభ్యుడిగా భావిస్తారు, కానీ రాజమౌళి గారు మాత్రం కేవలం అతి తక్కువ మందిని మాత్రమే తన సొంత కుటుంబ సభ్యుడిగా ఫీల్ అవుతారు. వారిలో నేను కూడా ఒకడిగా ఉండడం నేను చేసుకున్న అదృష్టం.ఇప్పుడు కూడా ఆయన శంకర్ పల్లి లో షూటింగ్ లో ఉన్నాడు. ఏ సినిమానో మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అనుకుంట. నేను పిలవగానే సమయానికి ప్యాకప్ చెప్పి ఇక్కడికి వచ్చాడు. మే 1న మీకు షూటింగ్ ఉన్నా లేకున్నా, కచ్చితంగా నా సినిమా చూడాల్సిందే. లేదంటే మీ పాస్ పోర్ట్ నేను లాగేసుకుంటా’ అంటూ చెప్పుకొచ్చాడు నాని.
ఈ ఈవెంట్ కి హిట్ 1, హిట్ 2 లలో హీరోలుగా నటించిన విశ్వక్ సేన్, అడవి శేష్ కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి గురించి నాని మాట్లాడుతూ ‘అడవి శేష్, విశ్వక్ సేన్ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది. ఒక కుటుంబం మొత్తం కలిసినట్టుగా ఉంది, హిట్ ప్రపంచాన్ని మీరు ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ హిట్ 3 మరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ శైలేష్ గురించి మాట్లాడుతూ ‘శైలేష్ బలం, బలహీనత అన్ని నాకు తెలుసు, ఆయన ఫుల్ స్టామినా ఇప్పటి వరకు ఉపయోగించుకోలేదు అని నాకు తెలుసు. మే1న మీరు చూసేది కేవలం ట్రైలర్ మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చాడు. చివర్లో ‘నా వెనుక రాజమౌళి గారు ఉన్నారు, ముందు మీరున్నారు, కడుపులో శ్రీవారి ప్రసాదం ఉంది, కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గారి స్టైల్ లో చెప్పాలంటే మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసాడు నాని.
Also Read : హీరో విశ్వక్ సేన్ తో వివాదం గురించి నాని సంచలన వ్యాఖ్యలు!