Bengaluru : ఆదివారం ఢిల్లీ – బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 8 వికెట్లు లాస్ అయ్యి..162 పరుగులు చేసింది. వాస్తవానికి సొంతవేదికలో ఢిల్లీ జట్టు ఇలా ఆడటం.. ఆ జట్టు అభిమానులకు కూడా రుచించలేదు. కేఎల్ రాహుల్ 41, స్టబ్స్ 34 ఆ మాత్రం పరుగులు చేయకుంటే ఢిల్లీ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది… బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, హేజిల్ వుడ్ 2 వికెట్లతో ఢిల్లీ జట్టు పతనాన్ని శాసించారు. అనంతరం 163 రన్స్ టార్గెట్ తో బెంగళూరు రంగంలోకి దిగింది. 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే లాస్ అయి.. టార్గెట్ ఫినిష్ చేసింది. కృణాల్ పాండ్యా 73(నాటౌట్), విరాట్ కోహ్లీ 51 రన్స్ స్కోర్ చేసి.. బెంగళూరు జట్టును ఢిల్లీ వేదికపై గట్టిగా నిలబెట్టారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ 2, చమీర 1 వికెట్ పడగొట్టారు.
Also Read : ఇది ఐపీఎల్లా? మిస్ యూనివర్స్ పోటీనా? మతులు పోతున్నాయి రా బాబూ!
టపా టపా మూడు వికెట్లు
163 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన బెంగళూరు.. కేవలం 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.. అక్షర్ పటేల్ రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో బెంగళూరు జట్టుకు ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు. ప్రమాదకరమైన బెతల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ వంటివారు వెంట వెంటనే వెను తిరగడంతో.. ఒక్కసారిగా మైదానంలో సంచలనం చోటు చేసుకుంది. ఈ దశలో వచ్చిన కృణాల్ పాండ్యా విరాట్ కోహ్లీకి అండగా నిలిచాడు. విరాట్ కోహ్లీతో కలిసి నాలుగో వికెట్ కు 84 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా ఫోర్లు, సిక్సర్లతో మైదానంలో సంచలనం సృష్టించాడు. కృణాల్ పాండ్యా మొదట్లో నిదానంగానే ఆడాడు. ఆ తర్వాత తన అసలు రూపాన్ని చూపించాడు. ముఖ్యంగా ముఖేష్ కుమార్ వేసిన 13 ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్లో రెండు భారీ సిక్సర్లు కొట్టి ఒక్కసారిగా గేర్ మార్చాడు. ఆ తర్వాత కృణాల్ పాండ్యా దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. అయితే స్టార్క్ బౌలింగ్ లో కృణాల్ పాండ్యా కు జీవదానం లభించింది. స్టార్క్ వేసిన బంతిని కృణాల్ పాండ్యా గట్టిగా కొట్టడంతో అది అమాంతం గాల్లోకి లేచింది. సునాయాసమైన క్యాచ్ ను పట్టడంలో ఢిల్లీ ఫిల్టర్ విఫలమయ్యాడు. ఇక అప్పటినుంచి కృణాల్ పాండ్యా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏమాత్రం భయపడకుండా.. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం తలవంచకుండా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ దశలో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు మరోవైపు విరాట్ కోహ్లీ కూడా అర్థ శతకం సాధించాడు. మొత్తంగా సొంతమైదానంలో విరాట్ కోహ్లీ ఆకట్టుకుంటే..కృణాల్ పాండ్యా అదరగొట్టాడు. వీరిద్దరూ బెంగళూరు జట్టును ఓటమి నుంచి గెలుపు దాకా తీసుకెళ్లారు. సొంత మైదానంలో ఢిల్లీ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకున్నారు. తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు.
Also Read : ఐసీసీ లో దక్షిణాఫ్రికా.. ఐపీఎల్ లో రాజస్థాన్.. దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్ జట్లివి!