Today Horoscope In Telugu: జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు చంద్రుడు, కుజుడు ఒకే రాశిలో ప్రయాణం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి శుభయోగాలు.. మరికొన్ని రాశుల వారికి ఆందోళన వాతావరణం ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసా..?
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఇతరుల వద్ద ధన సహాయము అడుగుతారు. కానీ ఎవరూ ధనం ఇవ్వరు. డబ్బు గురించి ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ప్రయాణాలు చేయకుండా ఉండాలి. పిల్లల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులు తోటివారి నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు.
Also Read: దొంగలు కట్టించిన మల్లన్న గుడి.. ఒక విచిత్రమైన చరిత్ర!
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కొన్ని కారణాలవల్ల వ్యాపారులకు లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొన్ని విషయాల పట్ల ఆందోళన చెందుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈరోజు వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు లాభాలను అర్ధించడానికి కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో ప్రశంసలు అందుకుంటారు. అయితే అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. రోజువారీ ఖర్చులు పెరుగుతాయి. ఇదే సమయంలో ఆదాయం కూడా సమకూరుతుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారి పనులు కాస్త ఆలస్యంగా పూర్తవుతాయి. పనులపై ఎక్కువగా శ్రద్ధ చూపలేరు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. అయితే వాటిని మౌనంగా ఉండడం వల్ల పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగులు అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటారు. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు మనసు కాస్త ఆందోళనగా ఉంటుంది. వ్యాపారులకు కొందరు వ్యక్తులు ఇబ్బందులు పెడతారు. ఉద్యోగులు ఆందోళనకరంగా ఉంటారు. కొందరి దృష్టి వీరిపై ఉండడం వల్ల పనులు అడ్డంకులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల్లో కొందరు మద్దతు ఇస్తూ.. మరి కొందరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించడం కష్టంగా మారుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మిక భావాలపై ఆసక్తి పెరుగుతుంది. అవసరంలో సాయం చేయడానికి నిరాకరించరు. కానీ ధన నష్టం జరుగుతుంది. మనసులో ప్రతికూల ఆలోచనలు రానీయకుండా చూడాలి. తోటి వారితో సంబంధాలు మెరుగుపరచుకోవాలి. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి ఇదే మంచి సమయం. వ్యాపారులు లాభాలు పొందుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వనరులు సమకూరుతాయి. వ్యాపారవేత్తలకు కాస్త ప్రతికూల వాతావరణ ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో ఇతరులకు వ్యతిరేకంగా ఉంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబానికి సమయం కేటాయించకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులో ఇప్పుడు పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో లాభాలు పొందుతారు. లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా మనసు విచారంగా ఉంటుంది. మనసులోకి ప్రతికూల ఆలోచనలు రానీయకుండా చూడాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే తీవ్రంగా నష్టాన్ని ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో నష్టాలను ఎదుర్కొంటారు. అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సివస్తుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయాలు అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి కారణంగా ఆందోళన ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. . ఈ రాశి వారు ఈ రోజు చేసే పనులపై శ్రద్ధ వహించాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు సీనియర్ల నుంచి కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులు అనుకోకుండా ఇబ్బందులు పడతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారి కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మనసు ఆందోళనగా ఉంటుంది. వీఆర్ యాత్రలపై ప్రత్యేక దృష్టి పెడతారు. కొన్ని విషయాలను సున్నితంగా పరిష్కరించుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణించే అవకాశం ఉంది. ఉద్యోగులు శుభ ఫలితాలు వింటారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు.