Retro VS Hit3 : మే1న నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన ‘హిట్ 3′(Hit : The Third Case) తో పాటు, తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) నటించిన ‘రెట్రో'(Retro Movie) చిత్రం కూడా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. రెండు చిత్రాల పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. రెండు సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ‘హిట్ 3’ కి అన్ని ప్రాంతాల్లో బుకింగ్స్ మొదలయ్యాయి కానీ, సూర్య ‘రెట్రో’ చిత్రానికి మాత్రం తమిళనాడు లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలు కాలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలయ్యాయి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, తెలుగు వెర్షన్ బుకింగ్ హైదరాబాద్ టాప్ థియేటర్స్ అన్నిట్లో మొదలైనప్పటికీ ట్రెండింగ్ లోకి రాకపోవడం. సూర్య సినిమాలకు తమిళం లో కంటే ఎక్కువగా తెలుగులోనే క్రేజ్ ఉంటుంది. చాలా సినిమాలు ఆయనవి తమిళం లో ఫ్లాప్ అయ్యి, తెలుగులో హిట్ అయ్యాయి.
Also Read : హిట్ 3′ లో పెహల్గామ్ ఘటనని రీ క్రియేట్ చేసిన డైరెక్టర్..ఇదెలా సాధ్యం?
మన ఆడియన్స్ లో అంతటి క్రేజ్ ని సంపాదించుకున్న సూర్య, రీసెంట్ గా ఆయన నటించిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆయనపై ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపడం లేదని రెట్రో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తేనే తెలుస్తుంది. ‘హిట్ 3’ బుకింగ్స్ తో పోల్చి చూస్తే ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ, అటు ఓవర్సీస్ లో కానీ, ‘రెట్రో’ దరిదాపుల్లోకి కూడా రాకపోవడం గమనార్హం. ‘హిట్ 3’ కి కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి రెండు లక్షల డాలర్లకు పైగా గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘రెట్రో’ కి ఇప్పటి వరకు పది వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ నుండి రాలేదు. ఇక హైదరాబాద్ లో అయితే ‘హిట్ 3’ 300 షోస్ నుండి కోటి 50 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టి, మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైం రికార్డుని నెలకొల్పే దిశగా అడుగులు వేస్తుంటే, రెట్రో కి ఇప్పటి వరకు కనీసం 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే మొదటి రోజు వసూళ్ల విషయంలో కూడా ‘హిట్ 3’ రెట్రో మీద భారీ మార్జిన్ తో లీడింగ్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇంకా తమిళనాడు కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వలేదు. అక్కడ బుకింగ్స్ ప్రారంభం అయ్యాక ఈ సినిమా రేంజ్ ఏమిటి అనేది తెలుస్తాది. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ ప్రకారం చూస్తే ‘హిట్ 3’ 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉండగా, ‘రెట్రో’ చిత్రానికి కేవలం 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. సూర్య గత చిత్రం ‘కంగువ’ కి మొదటి రోజు డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి, రెట్రో కి అందులో సగం కూడా రావడం అనుమానమే అని అంటున్నారు.