spot_img
Homeఎంటర్టైన్మెంట్Jersey: రీమేక్​లో ఒక్కోసారి సోల్ మిస్​ అవుతుంది.. హిందీ 'జెర్సీ'పై నాని ఏమన్నాడంటే?

Jersey: రీమేక్​లో ఒక్కోసారి సోల్ మిస్​ అవుతుంది.. హిందీ ‘జెర్సీ’పై నాని ఏమన్నాడంటే?

Jersey: నాని హీరోగా క్రికెట్ బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కిన జెర్సీ సినిమా ఎంత హిట్​ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఇప్పుడు ఈ సినిమా రీమేక్​గా షాహిద్​ కపూర్​ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హిందీలో రూపొందిస్తున్నారు. ఇక్కడ కూడా జెర్సీ అనే టైటిల్​ పెట్టారు. తాజాగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్​గా కనిపించనున్న ఈ సినిమా మేకింగ్ వీడియో విడుదలైంది. ఈ సినిమాకు దిల్​రాజు, సూర్య దేవర నాగ వంశీ, అమన్ గిల్​ సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రానుంది.

Samosa Diaries - Jersey | Shahid Kapoor & Mrunal Thakur | Sachet - Parampara | Gowtam Tinnanuri

కాగా, హిందీ జెర్సీ ట్రైలర్​పై నేచురల్​ స్టార్ నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. హిందిలో జెర్సీ ట్రైలర్​ తనకు నచ్చిందని అన్నారు. సినిమాలో సోల్​ మిస్​ కాకుండా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రీమేక్ చిత్రాల్లో భారీ బడ్జెట్ పెట్టి అంతా చక్కగా తెరకెక్కించినా.. ఒరిజినల్  సోల్​ మిస్​ అవుతూంటుందని.. అయితే, హిందీ జెర్సీ ట్రైలర్​ చూస్తే అలా అనిపించడం లేదని అన్నారు. సినిమా విడుదలైతే మంచి హిట్​ అవుతుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు నాని.  డిసెంబరు 31న హిందీ జెర్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

nani-comments-on-jersey-hindi-version

కాగా, ప్రస్తుతం నాని శ్యామ్​ సింగరాయ్​ ప్రమోషన్స్​లో పుల్ బిజీగా ఉన్నారు. రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 24న విడుదల కానుంది.  ఈ సినిమాలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. మరి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నానికి.. ఈ సినిమా మంచి హిట్ అందిస్తుందేమో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper
Exit mobile version