https://oktelugu.com/

National Film Awards: వైభవంగా 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం…

National Film Awards: 67 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ అవార్డుల ప్రదానంలో ఆలస్యంగా జరగగా… నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది మార్చి లో ఈ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు మన దేశ ఉప రాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా… సూపర్ స్టార్ రజనీకాంత్ కు 51 వ “దాదాసాహెబ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 25, 2021 / 01:24 PM IST
    Follow us on

    National Film Awards: 67 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ అవార్డుల ప్రదానంలో ఆలస్యంగా జరగగా… నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది మార్చి లో ఈ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు మన దేశ ఉప రాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    కాగా… సూపర్ స్టార్ రజనీకాంత్ కు 51 వ “దాదాసాహెబ్ ఫాల్కే” పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును వెంకయ్య నాయుడు చేతుల మీదుగా… రజినీకాంత్ అందుకున్నారు. సినీ రంగంలో గత నాలుగు దశాబ్ధాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ… రజినీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ ఈ వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు తలైవా. ​

    అలానే భోంస్లే చిత్రానికి మనోజ్ పాయ్.. అసురన్ చిత్రానికి ధనుష్ ఉత్తమ నటులుగా అవార్డులు అందుకున్నారు. మణికర్ణిక చిత్రానికి కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. 2019 లో ఉత్త‌మ తెలుగు చిత్రంగా జెర్సీ అవార్డు దక్కించుకోగా… మహేష్ బాబు హీరో గా నటించిన “మహర్షి” సినిమా “ఉత్తమ వినోదాత్మక చిత్రం” గా ఎంపిక అయ్యింది.

    ఒకే సంవత్సరం రజినీకాంత్, ఆయన అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడం పట్ల సూపర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడానికి రజినీ వెంట ఆయన భార్య, కూతురు ఐశ్వర్య వచ్చారు.