https://oktelugu.com/

Mahesh Babu: ఎన్టీఆర్ తో కృష్ణకు ఎక్కడ చెడింది… మహేష్ ని బాలయ్య అడుగుతాడా?

Mahesh Babu: బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో చివరి దశకు చేరింది. మహేష్ ఎపిసోడ్ తో మొదటి సీజన్ ముగించనున్నారు. ఆహా యాప్ లో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో ఊహకు మించిన రెస్పాన్స్ దక్కించుకుంది. టాప్ స్టార్స్ జీవితాల్లోని కాంట్రవర్సీలను చర్చకు తీసుకురావడంతో ఈ షో మరింత ప్రత్యేకంగా మారింది. సాధారణంగా టాక్ షోలు అంటే డిప్లొమాటిక్ ప్రశ్నలు, సమాధానాలతో ముగించేస్తారు. హోస్ట్ ఎవరైనా కానీ గెస్ట్ లైఫ్ లోని వివాదాల […]

Written By:
  • Shiva
  • , Updated On : December 23, 2021 / 10:26 AM IST
    Follow us on

    Mahesh Babu: బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో చివరి దశకు చేరింది. మహేష్ ఎపిసోడ్ తో మొదటి సీజన్ ముగించనున్నారు. ఆహా యాప్ లో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో ఊహకు మించిన రెస్పాన్స్ దక్కించుకుంది. టాప్ స్టార్స్ జీవితాల్లోని కాంట్రవర్సీలను చర్చకు తీసుకురావడంతో ఈ షో మరింత ప్రత్యేకంగా మారింది. సాధారణంగా టాక్ షోలు అంటే డిప్లొమాటిక్ ప్రశ్నలు, సమాధానాలతో ముగించేస్తారు. హోస్ట్ ఎవరైనా కానీ గెస్ట్ లైఫ్ లోని వివాదాల జోలికి వెళ్లరు. కానీ బాలయ్య వీటిపైనే ఫోకస్ చేస్తున్నారు.

    Balakrishna Mahesh Babu

    తన కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాలను కూడా బాలకృష్ణ చర్చకు తీసుకురావడం అందరినీ షాక్ కి గురి చేసిన అంశం. టీడీపీ పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కొడుకులు కాకుండా… చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకున్నారు. ఎన్టీఆర్-చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ వంటి మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్ బాలయ్య ఈ వేదిక సాక్షిగా డిస్కస్ చేశారు.

    ఈ నేపథ్యంలో మహేష్ తో బాలయ్య ఎపిసోడ్ ఎలా ఉండనుందనే ఆసక్తి పెరిగిపోయింది.ఒకప్పుడు ఎన్టీఆర్-కృష్ణ కుటుంబాల మధ్య పెద్ద అగాథం ఉండేది. సీతారామరాజు మూవీ విషయంలో ఎన్టీఆర్ తో కృష్ణకు విబేధాలు తలెత్తాయి. ఈ వైరం దశాబ్దాల పాటు సాగింది. కృష్ణపై కోపంతో ఎన్టీఆర్ ఆయనను ఇబ్బందులకు గురిచేశారనేది ఒక వాదన. రాజకీయంగా ఎన్టీఆర్ ఎదిగాక ఈ వేధింపులు మరింత పెరిగాయయట. అదే సమయంలో ఎన్టీఆర్ ని కూడా కృష్ణ టార్గెట్ చేశారు.

    Also Read: RRR: ప్రో కబడ్డీ వేదికపై ఆర్​ఆర్​ఆర్​ టీమ్​ సందడి.. ప్రమోషన్స్​ మాములుగా లేవుగా!

    ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా కొన్ని సినిమాలు తెరకెక్కించారు. ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ పై సెటైర్స్ వేస్తూ… చిత్రాలు చేశారు. కృష్ణ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడానికి కూడా కారణం ఎన్టీఆర్ తో ఉన్న వైరమే అని నానుడి. ప్రస్తుతం ఘట్టమనేని, నందమూరి కుటుంబాల మధ్య ఒకింత ఆరోగ్యకర వాతావరణం ఉంది. మహేష్ జూనియర్ ఎన్టీఆర్ కి చాలా క్లోజ్.

    కాగా అన్ స్టాపబుల్ షోలో మహేష్ తో బాలయ్య ఈ విషయం చర్చిస్తాడనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఎన్టీఆర్-కృష్ణ వైరం గురించి అప్పట్లో మీడియాలో వచ్చిన కథనాలకు స్పష్టత ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. మహేష్ ఎపిసోడ్ ప్రోమో విడుదలతో ఈ విషయంపై క్లారిటీ రానుంది.

    Also Read: Tollywood Unity: టాలీవుడ్ ఐక్యత రాగం: కలిసుందాం.. కలెక్షన్లు పెంచుకుందాం..

    Tags