https://oktelugu.com/

Jersey Movie: ‘జెర్సీ’ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

లేటేస్టుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న చిన్న సినిమాల్లో ‘సామజవరగమన’ ఒకటి. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఇందులో హీరోయిన్ గా రెబా మోనికా జాన్ నటించింది. అయితే మోనికా అంతకుముందే తెలుగు సినిమాల్లోకి రావాల్సి ఉండేది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 1, 2023 / 04:06 PM IST

    Jersey Movie

    Follow us on

    Jersey Movie: సినిమాల్లో అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు వెళ్లి సక్సెస్ అయిన వారు చాలా మందే ఉన్నారు. అయితే కొందరికి చేతిదాకా అవకాశం వచ్చినట్లే వచ్చి.. దూరమవుతుంది. కానీ ఆ తరువాత మరో మంచి అవకాశంతో వారు సక్సెస్ అవుతారు. అలా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. వారిలో రెబా మోనికా జాన్ ఒకరు. తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో నటించిన రెబా తెలుగులో ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయింది. అయితే అంతకుముందే రెండు సినిమాల్లో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి దూరమయ్యాయి. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే?

    లేటేస్టుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న చిన్న సినిమాల్లో ‘సామజవరగమన’ ఒకటి. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఇందులో హీరోయిన్ గా రెబా మోనికా జాన్ నటించింది. అయితే మోనికా అంతకుముందే తెలుగు సినిమాల్లోకి రావాల్సి ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టలేకపోయింది. నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ మూవీలో ఆయనకు జోడిగా శ్రద్ధా శ్రీకాంత్ నటించారు. వాస్తవానికి శ్రద్దా ప్లేసులో ముందుగా రెబా మోనికాను అనుకున్నారు. కానీ ఈమెకు కాల్ షీట్లు కుదరకపోవడంతో ఈ సినిమాను ఒప్పుకోలేదు.

    రీసెంట్ గా రిలీజ్ అయిన ‘బ్రో’ సినిమాలోనూ నటించే అవకాశం చేతిదాకా వచ్చిందట. ఇందులో సాయి ధరమ్ తేజ్ చెల్లెలుగా నటించే అవకాశం వచ్చిందట. ముందుగా ఆమెను ఇంటర్వ్యూకు పిలిచారట. అయితే ఆ క్యారెక్టర్ కు రెబా షూట్ కాకపోవడంతో ఏ విషయమూ చెప్పలేదట. దీంతో ఆమె ఇక తనకు తెలుగు సినిమాల్లో ఛాన్స్ రాదని కామ్ ఉందట. కానీ ఇంతలో ఓ రోజు ఆమె తన స్నేహితురాలితో కలిసి ఓ సినిమా షూటింగ్ కు వెళ్లింది.

    అక్కడ ‘సామజవరగమన’ చిత్రబృందం రెబాతో సెల్ఫీ దిగేందుకు వచ్చారట. నేను మీకు తెలుసా? అని అడగగానే ‘సామజవరగమన’ అనే సినిమాలో మిమ్మల్నే హీరోయిన్ గా అనుకున్నాము. కానీ మీరు ఒప్పుకుంటారో? లేదోనని ఎదురుచూస్తున్నాం. అనగానే మాక్కూడా తెలుగు సినిమాలో అవకాశం వస్తుందా? అని ఫన్నీగా అనేసరికి వెంటనే ఓకే చేశారట. దీంతో అలా ఈ సినిమాతో రెబాఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన మొదటి సినిమానే సక్సెస్ కావడంతో స్టార్ అయిపోయింది. **