https://oktelugu.com/

Chanakya Niti: చాణక్య నీతి: ఈ నాలుగు విషయాలలో సరిగ్గా ఉంటే కష్టాలు రావు!

Chanakya Niti: ప్రతి మనిషికి కష్టాలు ఉండటం సహజం. ఏ మనిషి కూడా కష్టాలు లేకుండా జీవించలేడు. అలా అని సంతోషం లేకుండా కూడా జీవించలేడు. ఒక మనిషికి కష్టం ఎంత ఉంటుందో.. సంతోషం కూడా అంతే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో కొందరికి తీరిపోలేని కష్టాలు ఉంటాయి. మరి ఆ కష్టాలను దరికి చేరకుండా ఉండాలంటే.. ఓ నాలుగు విషయాలలో సరిగ్గా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. ఇంతకు అందులో ఏ విషయాలు ఉన్నాయో తెలుసుకుందాం.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 23, 2021 / 10:08 AM IST
    Follow us on

    Chanakya Niti: ప్రతి మనిషికి కష్టాలు ఉండటం సహజం. ఏ మనిషి కూడా కష్టాలు లేకుండా జీవించలేడు. అలా అని సంతోషం లేకుండా కూడా జీవించలేడు.

    ఒక మనిషికి కష్టం ఎంత ఉంటుందో.. సంతోషం కూడా అంతే ఉంటుంది.

    Chanakya Niti

    కానీ కొన్ని సందర్భాలలో కొందరికి తీరిపోలేని కష్టాలు ఉంటాయి. మరి ఆ కష్టాలను దరికి చేరకుండా ఉండాలంటే.. ఓ నాలుగు విషయాలలో సరిగ్గా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. ఇంతకు అందులో ఏ విషయాలు ఉన్నాయో తెలుసుకుందాం..

    సరైన దృష్టి: ఏ విషయంలోనైనా సరైన దృష్టి ఉంటే మాత్రం భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు, పని చేసేటప్పుడు సరైన దృష్టితో చేసినట్లయితే ఎటువంటి కష్టాలు రావు.

    Also Read: కమ్ము కొస్తున్న ‘ఒమిక్రాన్’ మబ్బు.. ఫిబ్రవరిలో లాక్ డౌన్?

    సరైన ఆరోగ్యం: ఏ పని చేయాలన్నా ముందు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. ఆరోగ్యం బాగా లేనప్పుడు ఏ పనిచేసిన అది కష్టమే అవుతుంది. కాబట్టి సరైన ఆరోగ్యం కోసం మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి.

    ముందు జాగ్రత్త: ఏ పని ప్రారంభించినా ముందు దాని గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ పనిలోకి దిగాలి. లేదని.. అన్ని తెలుసు అన్నట్లు పనిలోకి దిగితే అన్ని కష్టాలే ఎదురవుతాయి.

    అబద్ధాలు మాట్లాడకూడదు: అబద్ధాలు ప్రతి ఒక్కరు ఆడుతుంటారు. కానీ సందర్భం బట్టి అబద్ధాలు ఆడవలసి ఉంటుంది. లేదా అదే పనిగా అబద్ధాలు ఆడటం వల్ల కచ్చితంగా కష్టాలు ఎదురవుతుంటాయి.

    Also Read: జుట్టు తెల్లబడటం మొదలైందా.. ఈ జాగ్రత్తలతో సమస్యకు సులువుగా చెక్!