కరోనా ప్రళయంతో అన్ని ఇండస్ట్రీలకు బ్రేక్ పడింది ఒక్క తెలుగు ఇండస్ట్రీకి తప్ప. ఏ..? తెలుగు హీరోలకు కరోనా అంటే భయం లేదా ? వాళ్ళు మాత్రం ఎలా షూటింగ్ లు చేస్తున్నారు ? అంటూ పక్క ఇండస్ట్రీ హీరోలు కూడా ఆరా తీస్తున్నారట. అయినా టాలీవుడ్ లో కూడా సినిమాల షూటింగులు రద్దు అయ్యాయి. ఒక్క నాని, బన్నీ మాత్రమే షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వలేదు. వాళ్ళు ఎందుకు బ్రేక్ ఇవ్వడం లేదు అంటూ సినీ జనం కూడా డౌట్ పడుతున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో 80% హీరోలు ఖాళీ అయిపోయారు. షూట్ చేసుకున్నే అవకాశం ఉన్నా.. రిస్క్ చేయడానికి హీరోలు భయపడుతున్నారు.
కాకపోతే ఈ భయపడే లిస్ట్ లో తాము ఉండబోము అంటూ నాని, బన్నీ మాత్రం తమ సినిమాల షూట్ ను మాత్రం ఆపడం లేదు. ఇప్పటికీ హైదరాబాద్ లో తమ షూటింగ్ ను కంటిన్యూ చేస్తున్నారు. నిజానికి ఈ హీరోలు ఇద్దరు చేస్తోన్న రెండు సినిమాలు ఇప్పట్లో రిలీజ్ అయ్యేవి కావు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే అసలు ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కావు. మరి ఎందుకు నాని, బన్నీ ఇంత తొందరపడుతున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నా వీళ్ళు ఎందుకు భయపడడం లేదు అనేదే ఫిలింనగర్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
అయితే అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్ కంటిన్యూ చేయడానికి కారణం.. పుష్ప టీమ్ ఇప్పటికే కరోనా కారణంగా పలుమార్లు షూటింగ్ కి విరామం ఇవ్వడమే . దాంతో ఎప్పటినుండో అన్ని జాగ్రత్తలు తీసుకుని షూట్ చేస్తున్నారు. అలాగే చిత్రయూనిట్ గత కొంతకాలంగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తమ సెట్స్ లోనే మకాం పెట్టింది. దాని కారణంగానే టీమ్ కి కరోనా భయం లేదు. ఒకవేళ కరోనా కేస్ లు నమోదు అయితే, అప్పుడు షూట్ కి బ్రేక్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇక నాని హీరోగా చేస్తోన్న ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకపోవడానికి కారణం.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక సెట్ వేశారు. ఆ సెట్ కేవలం మరో నెల రోజులు మాత్రమే ఉంటుంది, భారీగా ఖర్చు పెట్టి సెట్ వేయడంతో.. తప్పక షూట్ చేయాల్సి వస్తోంది. అందుకే నాని కూడా షూట్ లో పాల్గొంటున్నాడు. కరోనా నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట.