
ఐపీఎల్ 14 వ సీజన్ లో భాగంగా చెపాక్ మైదనంలో కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ మరికాసేపట్లో అమీతుమీ తేల్చుకో్నున్నాయి. ఈ సీజన్ ను విజయంతో ఆరంభించిన పంజాబ్.. ఆ తర్వాత వరుస ఓటములతో ఢీలా పడింది. మరోవైపు ముంబై కూడా ఈసారి సమిష్టిగా రాణించడంలో విఫలమతోంది. ఆ మ్యాచ్ లో గెలుపొంది తిరిగి విజయాల బాట పట్టాలని రెండు జట్లు చూస్తున్నాయి. టాస్ గెలిచిన పంజబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు.