
ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన కోవిడ్ సమీక్షా సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది. ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమైన ఈ కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ టెలికాస్ట్ చేయడం పై పధాని అసహనం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ మాట్లాడుతుండగా ప్రధాని కల్పించుని ఏం జరుగుతోంది. ఇది మన సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధం అంటూ లైవ్ టెలికాస్ట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే అరవింద్ కేజ్రీవాల్ తేరుకుని క్షమాపణలు చెప్పారు.