Nani : ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు ఉన్నప్పటికి సోలోగా ఇండస్ట్రీ కి వచ్చి మంచి విజయాలను సాధిస్తూ స్టార్ హీరోలుగా మారిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు… అందులో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాం…ఇక ఆయన తర్వాత ఈ జనరేషన్ లో సోలోగా వచ్చి మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో నాని…ఆయన లాంటి హీరో ఈ జనరేషన్ లో మరొకరు ఉండరనేది వాస్తవం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు నాని… బాపు(Bapu)గారి డైరెక్షన్ లో ‘రాధాగోపాలం ‘ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినిమా కెరియర్ ను మొదలుపెట్టిన నాని ఆ తర్వాత అష్టచమ్మా(AshtaChamma) సినిమాతో హీరోగా మారి భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఫ్యూచర్ లో స్టార్ హీరో రేంజ్ ను కూడా టచ్ చేస్తాడు అంటూ విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు…ప్రస్తుతం 200 కోట్ల మార్కెట్ ను కలిగి ఉన్న హీరోగా తనకంటు ఒక ఐడెంటిటి సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక అష్టచమ్మా, అలా మొదలైంది, ఈగ, పిల్లజమీందర్, బలే బలే మగాడివోయ్, ఎవడే సుబ్రహ్మణ్యం, దసర, హాయ్ నాన్న, సరిపోదా శనివారం లాంటి సినిమాలతో తనకంటూ ఒక భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు… అలాంటి నాని ఈరోజు తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు… ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇక దాంతో పాటుగా ‘హిట్ 3′(Hit 3)సినిమాతో నానిలోని మరో యాంగిల్ ని బయటకు తీయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా నాని ఇండస్ట్రీలో ఎవ్వరి సపోర్టు లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా 400 రూపాయలకు తన కెరీర్ ని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), మాస్ మహారాజ రవితేజ(Raviteja) తర్వాత ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా ఎదిగిన హీరోల్లో ఈయన కూడా ఒకడిగా మిగిలాడు…అలాంటి నాని రాబోయే రోజుల్లో కూడా స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయాలని కోరుకుంటున్నాడు. అందుకే స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా ఆయన ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ ముందుకు సాగుతూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…నానితో సినిమా చేయడానికి ఇతర భాషల దర్శకులు సైతం పోటీ పడుతున్నారు అంటే ఆయన క్రేజ్ ఏ లెవల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…