Social Welfare Hostel : అక్కడ విద్యార్థులే( students) స్వయంగా వండుకోవాలి. ఒకవైపు చదువుకుంటూనే.. మరోవైపు పాకాలు తీయాలి. లేకుంటే పస్తులు ఉండాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నెలలుగా ఇదే ఇబ్బందులతో చదువుకుంటున్నారు అక్కడి విద్యార్థులు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు మూడు పూటల పనిచేసి.. ఆపై అతి కష్టం మీద చదువుతున్నారు. వంట చేయడం అంటే వస్తువులు ఉండాల్సిందేనని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే రోజు రోజుకు ఈ వేధింపులు ఎక్కువ కావడంతో విద్యార్థులు ఈ విషయాన్ని బయటపెట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ హాస్టల్ విద్యార్థులు పడుతున్న బాధలు సోషల్ మీడియాలో వైరల్ అంశాలుగా మారిపోయాయి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
* చపాతీల తయారీ
పొట్టి శ్రీరాములు నెల్లూరు ( Potti sriramulu Nellore) జిల్లా గండిపాలెం గురుకుల విద్యాలయంలో 428 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యార్థులకు వంట చేసేందుకు ఇద్దరు కుక్ లు, ఇద్దరు సహాయకులు ఉన్నారు. కానీ వందలాదిమంది విద్యార్థులకు భోజనాలు అందించడం కష్టమవుతోందని భావించారు అక్కడి సిబ్బంది. ఆహారం తయారు చేసేందుకు 15 మంది విద్యార్థుల చొప్పున బ్యాచులుగా విభజించారు. రొటేషన్ పద్ధతిలో వీరితో వంటలు చేయిస్తున్నారు. ఆదివారం నాడు మెనూలో భాగంగా చపాతీలు చేయాల్సి ఉంది. అక్కడ ఉన్న విద్యార్థులందరికీ కలిపి దాదాపు 1300 చపాతీలు అవసరం. దీంతో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకే ఒక బ్యాచ్ విద్యార్థులతో చపాతీలు తయారు చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
* గతంలో ఆత్మకూరు హాస్టల్ లో..
గతంలో ఆత్మకూరు( Atmakur ) గురుకుల పాఠశాలలోని వసతి గృహంలో సైతం ఇటువంటి దృశ్యాలు వెలుగు చూసాయి. ప్రతిరోజు అక్కడ 500 మంది విద్యార్థులకు 1500 చపాతీలు అవసరం. అయితే సిబ్బంది లేరన్న సాకు చూపి విద్యార్థులతోనే వాటిని చేయిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పట్లో అది మీడియాలో సంచలనంగా మారింది. అది మరువకముందే మరోసారి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఏపీలో విద్యార్థులతో వంట పని చేయిస్తున్న గురుకుల సిబ్బంది
నెల్లూరు – ఉదయగిరి మండలంలో గండిపాళెం పాఠశాలలో తెల్లవారుజామున 3 గంటలకే 9వ తరగతి విద్యార్థులతో చపాతీలు చేయించిన గురుకుల సిబ్బంది
తమ పిల్లలతో చాకిరీ చేయించడంపై తల్లిదండ్రుల ఆగ్రహం
ప్రతి ఆదివారం ఇలాగే చేయిస్తామని… pic.twitter.com/4Wgu0jE4Ac
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2025