https://oktelugu.com/

Mokshagna Teja: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ వచ్చేశాడు… ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఫస్ట్ లుక్!

ఎట్టకేలకు బాలయ్య అభిమానుల కోరిక నెరవేరింది. ఆయన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. నందమూరి మోక్షజ్ఞ జన్మదినం పురస్కరించుకుని ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Written By:
  • S Reddy
  • , Updated On : September 6, 2024 / 12:00 PM IST

    Mokshagna Teja

    Follow us on

    Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ టాలీవుడ్ హాట్ టాపిక్. గత ఐదేళ్లుగా బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞ హీరో కావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఏడాది వారు మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సాధారణంగా హీరోల వారసులు 20 ఏళ్ళు నిండగానే రంగంలోకి దిగుతారు.మహేష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలు టీనేజ్ లోనే ముఖానికి రంగేసుకున్నారు. వారిప్పుడు స్టార్ హీరోల లిస్ట్ లో ఉన్నారు.

    బాలయ్య కొడుకు మోక్షజ్ఞ వయసు మూడు పదులకు చేరువైంది. ఆయన ఎంట్రీ చాలా ఆలస్యమైంది. మోక్షజ్ఞకు హీరో కావడం ఇష్టం లేదనే వాదన కూడా వినిపించింది. మోక్షజ్ఞ ఫ్యామిలీ ఫోటోల్లో షేప్ అవుట్ బాడీలో కనిపించి షాక్ ఇచ్చాడు. మోక్షజ్ఞ లుక్ పుకార్లకు బలం చేకూర్చింది. మరోవైపు బాలయ్య ప్రతి ఏడాది మోక్షజ్ఞ హీరో అవుతున్నాడని ప్రచారం చేస్తున్నాడు. కానీ కార్యరూపం దాల్చలేదు.

    ఎట్టకేలకు బాలయ్య అభిమానుల కల నెరవేరింది. మోక్షజ్ఞ హీరోగా వచ్చేశాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను లాంచ్ చేస్తున్న నేపథ్యంలో అధికారికంగా పోస్టర్ విడుదల చేశాడు. మోక్షజ్ఞకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ నేడు విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. స్లిమ్ అండ్ ఫిట్ లుక్ లో మోక్షజ్ఞ అదరగొట్టాడు. నందమూరి అందగాడు అనే వాళ్ళ నాన్న బిరుదును ఇప్పుడు మోక్షజ్ఞకు ఇవ్వాల్సిందే. అలా ఉంది మోక్షజ్ఞ గ్లామర్.

    ఇటీవల సింబ ఈజ్ కమింగ్ అని ప్రశాంత్ వర్మ ఓ పోస్ట్ పెట్టాడు. మరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ టైటిల్ అదే కావచ్చు. సింహ బాలయ్యకు కలిసొచ్చిన టైటిల్. సింహతో కూడిన టైటిల్స్ తో ఆయన చేసిన చిత్రాలు బ్లాక్ బస్టర్ కొట్టాయి. సింబ అంటే సింహం పిల్ల అనే అర్థం కూడా వస్తుంది. మొత్తంగా మోక్షజ్ఞ బర్త్ డే ట్రీట్ అదిరింది. నందమూరి అభిమానులకు నేడు పండగ రోజు.

    ఈ మూవీలో హీరోయిన్ శ్రీలీల అనే ప్రచారం జరుగుతుంది. అమితాబ్ కీలక రోల్ చేస్తున్నాడట. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందట. ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా బాలయ్య చిన్న కూతురు తేజస్విని రంగంలోకి దిగింది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ బాలయ్య ఫ్యాన్స్ కి చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు.