https://oktelugu.com/

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మీద బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయి…

సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని ఇక్కడ సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగాలనే ఉద్దేశ్యంతోనే ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. ఇక్కడ కొందరికి సూపర్ సక్సెస్ లు లభిస్తే, మరి కొందరికి మాత్రం వరుస ప్లాప్ లు రావడమే కాకుండా వాళ్లు ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 6, 2024 / 11:54 AM IST

    Pawan Kalyan OG

    Follow us on

    Pawan Kalyan OG: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయం నుండి ‘పవర్ స్టార్’ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన బర్త్ డే సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాని రీ రిలీజ్ చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచిన విషయం మనకు తెలిసిందే. ఈ మూడు సినిమాలని తొందర్లోనే ఫినిష్ చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఓజీ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు సైతం విపరీతంగా ఎదురుచూస్తున్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు.

    నిజానికి ఓజి టీజర్ ని కనక మనం చూసినట్లైతే చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా అందులోని పవర్ ఫుల్ డైలాగ్ లు బాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అందువల్లే వాళ్ళు ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగానే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక ఇప్పటి వరకు ఆయన పాన్ ఇండియాలో ఒక్క సినిమా చేయకపోయినప్పటికీ మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఎలక్షన్స్ సమయం లో పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడడంతో ఆయనకు పాన్ ఇండియాలో భారీ క్రేజ్ అయితే ఏర్పడింది. అందుకోసమే ఓజీ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు.

    ఇక పవన్ కళ్యాణ్ తరహా యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలావరకు నచ్చుతుందని వాళ్ళందరూ ఈ సినిమాను చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా మీద మంచి అశాలు పెట్టుకున్నాడు… మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు కానీ తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది…