https://oktelugu.com/

Ram Charan And Surya: రామ్ చరణ్, సూర్య కాంబోలో రానున్న భారీ మల్టీ స్టారర్ మూవీ…దర్శకుడు ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలకి మంచి గిరాకీ పెరుగుతుంది. ఎక్కడ చూసినా స్టార్ హీరోలతో భారీ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : September 6, 2024 / 12:06 PM IST

    Ram Charan And Surya

    Follow us on

    Ram Charan And Surya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్…ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి ఆయన చేసిన త్రిపుల్ ఆర్ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ గా కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఇక ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇదిలా ఉంటే సూర్యతో కలిసి ఈయన ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దీనికి దర్శకుడుగా తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శివ వ్యవహరించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

    అయితే ప్రస్తుతం శివ సూర్య ని హీరోగా పెట్టి ‘కంగువా’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సక్సెస్ అయితే వీళ్ళిద్దరి కాంబోలో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. సూర్య, రామ్ చరణ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. ఇక రామ్ చరణ్ అభిమాన నటుడు కూడా సూర్యనే కావడం విశేషం…

    ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే చూడడానికి అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇక ఇప్పటికే శివ వీళ్ళిద్దరికీ కథ చెప్పి ఒప్పించడట. కానీ కంగువా సినిమా రిజల్ట్ మీదనే ఈ భారీ మల్టీస్టారర్ సినిమా ఉంటుందా లేదా అనేది డిపెండ్ అయి ఉందని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే కంగువా తో సక్సెస్ వస్తేనే రామ్ చరణ్ అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని లేకపోతే మాత్రం ఈ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కే అవకాశం లేనట్టే…

    ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ విపరీతంగా కష్టపడుతున్నాడు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో సక్సెస్ కొట్టి ఆ తర్వాత బుచ్చి బాబు సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు…మరి రాబోయే రెండు సినిమాలతో భారీ సక్సెస్ ని సాధించి మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…