Nandamuri Mokshagna : నందమూరి బాలకృష్ణ సినీ వారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా ? అని ఆశగా ఎదురుచూస్తున్నారు బాలయ్య అభిమానులు. అయితే, మోక్షజ్ఞ ఎంట్రీ పై ఒక ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ ఏమిటంటే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుందట. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిందని, రచయిత ఎం రత్నం.. మోక్షజ్ఞ కోసం ఓ పవర్ ఫుల్ కథ రాశాడని తెలుస్తోంది. కాకపోతే, ఈ సినిమా మరో ఏడాది తర్వాతే మొదలవుతుంది.

ప్రస్తుతం బోయపాటి తన తర్వాత చిత్రాన్ని అల్లు అర్జున్ తో ప్లాన్ చేశాడు. ఆ సినిమా తర్వాత మోక్షజ్ఞతో ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తాడట. అన్నట్టు ఈ సినిమాలో బాలయ్య కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో రెండు నేపథ్యాలు ఉండబోతున్నాయని.. చారిత్రకంతో పాటు ఐరోపా నేపథ్యాన్ని కూడా సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది.
ముఖ్యంగా మోక్షజ్ఞ పాత్ర చాలా వినూత్నంగా ఉండబోతుందట. అయితే, మొదటి సినిమాలోనే విభిన్న పాత్రలో కనిపించడం ఒకవిధంగా రిస్క్. అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. ఎందుకంటే.. బాలయ్య అభిమానులకు ఎక్కువుగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే నచ్చుతాయి. బాలయ్య అభిమానులు పక్కా మాస్ ఆడియన్స్.
మరి వారికీ నచ్చే విధంగా సినిమా చేయాలి అంటే.. ఆ కొత్తదనంలో బోయపాటి మార్క్ కూడా ఉండాలి. అందుకే, బోయపాటికి తన కొడుకు ఎంట్రీని అప్పగించాడు బాలయ్య. ఇక మోక్షజ్ఞ బాగా కష్టపడుతున్నాడు. హీరో అయ్యే దిశగా మోక్షజ్ఞ భారీ కసరత్తు చేస్తున్నాడు. అయితే, ‘ఆదిత్య 369’ సీక్వెల్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ అని ఆ మధ్య బాగా టాక్ నడిచింది.

పైగా మోక్షజ్ఞ తెరంగేట్రం చేయడానికి ‘ఆదిత్య 369’ సీక్వెల్ పర్ఫెక్ట్ అంటూ నందమూరి అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఉన్నట్టు ఉండి.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ ప్లేస్ లోకి బోయపాటి సినిమా రావడం అనేది విశేషమే.