Pushpa: పుష్పరాజ్​గా దర్శనమిచ్చిన వార్నర్​… తగ్గేదెలేదంటూ బన్నీ కామెంట్​

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే  ఈ చిత్రం నుండి విడుదలైనట్రైలర్ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 12, 2021 8:29 am
Follow us on

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే  ఈ చిత్రం నుండి విడుదలైనట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఇప్పటికే వచ్చిన పాటలు, టీజర్స్​ మంచి క్రేజ్​కు దక్కించుకున్నాయి. వాటిల్లో ఏయ్​ బిడ్డా ఇది నా అడ్డా పాట కూడా ఒకటి.

https://www.instagram.com/tv/CXVv7sbJU1X/?utm_source=ig_web_copy_link

ఇకపోతే, ఆస్ట్రేలియా క్రికెటర్​ డేవిడ్​ వార్నర్​ అల్లు అర్జున్​ పాటలకు గతంలో స్టెప్పులేసి భారత్​లో మంచి క్రేజ్​ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. వీలున్నప్పుడల్లా తన భార్యాపిల్లలలో బన్నీ పాటలకు డాన్స్ వేస్తూ కనిపిస్తుంటారు. వీటిని సోషల్​మీడియాలో పోస్ట్​ చేసి.. బన్నీ ఫ్యాన్స్​ నుండి పొగడ్తలను అందుకుంటారు. ఇటీవలే కాస్త గ్యాప్​ ఇచ్చిన వార్నర్​.. తాజాగా పుష్ప లోనుంచి ఏయ్​ బిడ్డా సాంగ్​తో ప్రత్యక్షమయ్యాడు.

బన్న్ీ ఫేస్​ని తన ఫేస్​తో మార్ఫ్​ చేసి వార్నర్​ చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వారల్​గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. విరాట్​ కోహ్లీ కూడా మేట్​ ఆర్​యూ ఓకే అంటూ కామెంట్​ చేయగా.. పుష్ప హీరో అల్లు అర్జున్​ స్పందిస్తూ.. వార్నర్​ బ్రదర్​ తగ్గేదెలే అంటూ పుష్ప తరహాలో కామెంట్​ పెట్టారు.