Bimbisara Movie: నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు నందమూరి కళ్యాణ్ రామ్. తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాడు కళ్యాణ్ రామ్. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్లో దూసుకెళ్లిపోతున్నారు కళ్యాణ్. ప్రస్తుతం నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె నిర్మిస్తున్న సినిమా “బింబిసార” సినిమాలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్… అనేది ఉపశీర్షిక. ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోగా కళ్యాణ్ రామ్ కి ఇది 18వ చిత్రం కావడం విశేషం. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది.
ఇప్పుడు తాజాగా సినిమా టీజర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ కి కూడా మంచి స్పందన లభిస్తోందని యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మైథిలాజికల్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించడం ఇదే తొలిసారి. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. కళ్యాణ్ సరసన కేథరిన్ థెరిస్సా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి పాటలు రాస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఇటీవల ‘బింబిసార’ ఫస్ట్ లుక్ విడుదల అయినప్పుడు కల్యాణ్ రామ్ లుక్ కొత్తగా ఉందని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. కదన రంగంలో శత్రు సైనికులను చంపి, వారి శవాలపై ఠీవిగా కూర్చున్న కథానాయకుడి లుక్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
'A Time Travel From Evil To Good'#BimbisaraTeaser out now!
▶️ https://t.co/OsGqgXfL6t#Bimbisara@DirVashist @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @Music_Santhosh @ChirantannBhatt @anilpaduri @NTRArtsOfficial pic.twitter.com/gWNlQA5aAA
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 29, 2021