Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరో గా నటించిన ‘అర్జున్ S/O వైజయంతి'(Arjun S/O Vyjayanthi) నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత ఒక మంచి ఎమోషనల్ డ్రామా మూవీ ని చూసాము అనే టాక్ ఆడియన్స్ నుండి బలంగా వచ్చింది కానీ, ఓపెనింగ్స్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 2 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్లు కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతానికి కలిపి వచ్చిన వసూళ్లు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 23 కోట్ల రూపాయలకు జరిగింది. రెండవ రోజు కూడా వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు, బ్రేక్ ఈవెన్ కి ఇది ఏమాత్రం సరిపోదు.
Also Read: ‘కేసరి 2’ మొదటి రోజు వసూళ్లు..పాజిటివ్ టాక్ తో ఇంత తక్కువనా?
కానీ మూవీ టీం నేడు సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. హీరో కళ్యాణ్ రామ్ తో పాటు విజయశాంతి మరియు ఇతర నటీనటులు, డైరెక్టర్, నిర్మాత అందరూ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రోల్ మెటీరియల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన విషయం ఏమిటంటే. నిర్మాత గారు రోజంతా నాతోనే ఉన్నారు నిన్న మొత్తం. ఆయనకు అన్ని ప్రాంతాల నుండి బయ్యర్స్ కాల్ చేసారు. కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అండీ. వచ్చే వారం మంగళవారం లోపు మేము పెట్టిన డబ్బులు మాకు వచ్చేస్తాయి అని చెప్పారు. ఇది మామూలు విషయం కాదు, దీనిని మేము అతిశయోక్తి చేసి రేపే బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పొచ్చు. కానీ మేము అలా చెప్పడం లేదు, మంగళవారం, బుధవారం లోపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వుద్ది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంత గొప్ప సినిమాని అందించినందుకు వాళ్ళు మాకు థాంక్స్ చెప్పారు, నేను కూడా వాళ్లకు సభాముఖంగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. మా సినిమాకు చాలా సహాయం చేసారు అంటూ కళ్యాణ్ రామ్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఆయన చెప్పిన విధంగా మంగళవారం కి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే, మొదటి వీకెండ్ లో కచ్చితంగా 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే కనీసం వీకెండ్ కి పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు. మరి కళ్యాణ్ రామ్ మంగళవారానికి బ్రేక్ ఈవెన్ అయిపోతుందని ఎలా అబద్ధం చెప్పాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజాలు నిక్కచ్చి గా మాట్లాడే కళ్యాణ్ రామ్ నుండి ఇలాంటి ఊహించలేదంటూ చెప్పుకొస్తున్నారు.