Arjun Son Of Vyjayanthi Review: సినిమా ఇండస్ట్రీలో కళ్యాణ్ రామ్ కి నటుడిగా చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆయన ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో సన్నాఫ్ వైజయంతి అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది…అయితే e మూవీ ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: ‘అర్జున్ S/O వైజయంతి’ ట్విట్టర్ రివ్యూస్ వచ్చేసింది..ఈ రేంజ్ లో చెప్తున్నారేంటి!
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే వైజయంతి అనే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి అర్జున్ అనే ఒక కొడుకు ఉంటాడు. ఆమె ఎంత సిన్సియర్ గా ఉంటుందో వాళ్ళ కొడుకు అంత చిల్లరగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇక తన కొడుకు ద్వారా తను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది. ఆమెకి వచ్చిన ప్రాబ్లం తన కొడుకు ఎలా సాల్వ్ చేశాడు అనే విషయాలు తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మరోసారి తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే కాకుండా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నమైతే చేశాడు. ఇక ప్రదీప్ చిలుకూరి రాసుకున్న కథ రొటీన్ రెగ్యులర్ టెంప్లేట్ లో ఉన్నప్పటికి ఆయన ఈ సినిమాకు అందించిన ట్రీట్ మెంట్ కొంతవరకు ఓకే అనిపించింది.
ప్రేక్షకుడు ఎలాంటి అంశాలకైతే కనెక్ట్ అవుతాడో అలాంటివి ఈ సినిమాలో చాలా ఎక్కువ సంఖ్యలో పెట్టారు. ముఖ్యంగా ఈ సినిమా సీన్స్ కోసం రాసుకున్న ట్రీట్మెంట్ లో దర్శకుడు కొంతవరకు కొత్తదనాన్ని ఫాలో అయ్యాడు. అయితే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ని చూపిస్తూ ఇప్పటివరకు చాలా సినిమాలైతే వచ్చాయి. అలాగే మదర్ సన్ కూడా బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో విజయ శాంతి, కళ్యాణ్ రామ్ మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయనే చెప్పాలి. తల్లి కోసం తను ఏం చేశాడు అనేది చాలా బాగా చూపించారు. కొంతవరకు ఓకే అనిపించినప్పటికి సెకండ్ హాఫ్ లో డీసెంట్ గా ఉంది.
ఇక క్లైమాక్స్ లో వచ్చే 20 నిమిషాల ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ విజయశాంతి ల మధ్య ఒక మదర్ సన్ బిల్డ్ అవుతుంది. పటాస్ లాంటి సినిమాలో కళ్యాణ్ రామ్ సన్ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేశాడు. ఇక ఈ సినిమాలో మదర్ సన్ ఎమోషన్స్ ని పీక్స్ లెవెల్ లో చూపించే ప్రయత్నం అయితే చేశారు. కొన్ని ఎమోషన్స్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సైతం ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయిందనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. తమ క్యారెక్టర్ కి ఎంత అయితే యాక్టింగ్ అవసరం ఉందో ఆ మేరకు సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి నటించిన విధానమైతే ప్రేక్షకులకు బాగా నచ్చింది. మరి ఇలాంటి సందర్భంలోనే విజయశాంతి పోషించిన పాత్ర సినిమాకి హైలైట్ గా నిలవడమే కాకుండా మరోసారి తన గత సినిమాల పొటెన్షియాలిటీని చూపించారు.
ఇక వీళ్లిద్దరి మీద ఈ సినిమా మొత్తం డిపెండ్ అయి ఉంది. వీళ్ళ మధ్య మంచి సినిమాలు రావడం ప్రతి సీన్ లో వీళ్ళకి సంబంధించిన కోర్ ఏమోషన్ ని హైలైట్ చేస్తూ దర్శకుడు సినిమాను తీసుకెళ్లిన విధానం వల్ల వీళ్ళిద్దరి యాక్టింగ్ అయితే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ సినిమాని తమ భుజాల మీద ముందుకు తీసుకెళ్లారు… ఇక మిగతా ఆర్టిస్టులు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ప్లస్ అయింది.దానివల్ల ఎమోషనల్ సీన్స్ చాలా వరకు హైలైట్ అయ్యాయి. అలాగే సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ప్రతి షాట్ ని చాలా కొత్తగా రూపొందించే ప్రయత్నమైతే చేశారు. అందువల్ల ఈ సినిమా మిగతా సినిమాలన్నింటికంటే కూడా బెటర్మెంట్ గా కనిపించింది… ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
కళ్యాణ్ రామ్, విజయశాంతి
కొన్ని ఎమోషనల్ సీన్స్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
రేటింగ్
ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.5/5