https://oktelugu.com/

Balakrishna Love Story: ముస్లిం హీరోయిన్ ని ప్రేమించి పెళ్ళికి సిద్ధమైన బాలయ్య… మరి ఏం జరిగింది!

Balakrishna Love Story: బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అంటారు. పైకి గంభీరంగా, కరుకుగా కనిపిస్తాడు కానీ పొగడ్తలకు ఇట్టే పడిపోతారు. ఆయనది సున్నితమైన మనసు కూడాను. ఒక వ్యక్తి నచ్చితే జీవితాంతం అసలు వదులుకోవడానికి ఇష్టపడరు. బాలయ్యతో సాన్నిహిత్యం ఉన్నవారు ఎవరైనా చెప్పే మాట ఇదే. అందుకే ఆవేశంలో బాలయ్య చెయ్యి చేసుకున్నా ఫ్యాన్స్ మాత్రం మా బాలయ్యేగా అంటారు. మరి ఇంత స్వచ్ఛమైన మనసు కలిగిన బాలయ్య ఎవరి ప్రేమలో పడకుండా ఉన్నారా? అంటే లేదు. […]

Written By:
  • Shiva
  • , Updated On : June 21, 2022 / 02:37 PM IST
    Follow us on

    Balakrishna Love Story: బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అంటారు. పైకి గంభీరంగా, కరుకుగా కనిపిస్తాడు కానీ పొగడ్తలకు ఇట్టే పడిపోతారు. ఆయనది సున్నితమైన మనసు కూడాను. ఒక వ్యక్తి నచ్చితే జీవితాంతం అసలు వదులుకోవడానికి ఇష్టపడరు. బాలయ్యతో సాన్నిహిత్యం ఉన్నవారు ఎవరైనా చెప్పే మాట ఇదే. అందుకే ఆవేశంలో బాలయ్య చెయ్యి చేసుకున్నా ఫ్యాన్స్ మాత్రం మా బాలయ్యేగా అంటారు. మరి ఇంత స్వచ్ఛమైన మనసు కలిగిన బాలయ్య ఎవరి ప్రేమలో పడకుండా ఉన్నారా? అంటే లేదు. ఆయనకు ఓ ప్రేమ కథ ఉంది. బాలయ్య ఓ హీరోయిన్ ని మనస్ఫూర్తిగా ప్రేమించారు. ఆమెతో ఏడడుగులు నడవాలనుకున్నాడు. అయితే ఇద్దరు వ్యక్తుల కారణంగా అది కుదరలేదు.

    Balakrishna

    బాలయ్యకి ఓ సీరియస్ లవ్ స్టోరీ ఉందని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే వర్మ ‘నగ్నం’ హీరోయిన్ శ్రీరాపాక కూడా ఇదే విషయం చెప్పారు. ఆమె బాలకృష్ణ వద్ద కొన్నాళ్ళు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారట. ఆ సమయంలో బాలకృష్ణ వ్యక్తిగత విషయాలు కూడా ఆమెతో పంచుకునేవారట. ఒక సందర్భంలో యంగ్ ఏజ్ లో తాను ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పారట.

    Also Read: Mallemaala Entertainments: వాడుతున్న ‘మల్లె’ దండ.. వీడుతున్న నట పుష్పాలు

    మరి బాలయ్య అంతగా ఇష్టపడిన ఆ హీరోయిన్ ఎవరో కాదు… కుష్బూ. బాలయ్య కుష్బూని ఎంతగానో ఇష్టపడ్డారట. ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారట. కుష్బూతో బాలకృష్ణ ప్రేమ వ్యవహారం ఎన్టీఆర్, హరికృష్ణలకు తెలిసి మండిపడ్డారట. హీరోయిన్ ని ఇంటి కోడలిగా ఎన్టీఆర్ ఒప్పుకోలేదట. కుష్బూతో ప్రేమా పెళ్లి ఆలోచనలు మానేయాలని బాలయ్యకు ఎన్టీఆర్, హరికృష్ణ గట్టి వార్నింగ్ ఇచ్చారట. తండ్రి అంటే భయం, అత్యంత గౌరవం కలిగిన బాలయ్య తన ప్రేమను త్యాగం చేశారట.

    Balakrishna, NTR

    అయితే కెరీర్ లో బాలయ్యతో కుష్బూ ఒక్క చిత్రం కూడా చేయకపోవడం విశేషం. ఆమె ఎక్కువగా నాగార్జున, వెంకటేష్ చిత్రాల్లో నటించారు. కుష్బూ నేపథ్యం చుస్తే.. మహారాష్ట్రకు చెందిన ముస్లిం అమ్మాయి అయిన కుష్బూ సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా వెలిగారు. కెరీర్ మొదలైంది తెలుగులోనే. వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు మూవీతో కుష్బూ వెండితెరకు పరిచయమయ్యారు. 1991 నుండి నాలుగేళ్లు కుష్బూ హీరో ప్రభుతో డేటింగ్ చేశారు. ప్రభు తండ్రి శివాజీ గణేశన్ వ్యతిరేకించడం తో విడిపోయారు. 2000లో దర్శకుడు సి, సుందర్ ని ఆమె వివాహం చేసుకోవడం జరిగింది.

    Also Read:Major Closing Collections: మేజర్ క్లోసింగ్ కలెక్షన్స్

    Recommended Videos

     

    Tags