Mallemaala Entertainments: వెండితెరపై.. బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్.. క్యాష్, ఢీ, జబర్దస్త్ వంటి షోలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. మల్లెమాల ప్రోగ్రామ్స్ అన్నీ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ సంస్థ ద్వారా పరిచయమవుతున్న నటీనటులు మంచి రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదుగుతున్నారు. తాజాగా మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ సహకారంతో మంచి నటులుగా, యాంకర్లుగా ఎదిగన వారు సంస్థను వీడుతున్నారు. స్టార్ యాంకర్లు, కమెడియన్లు ఈ షోలను విడిచిపెడుతుండడంతో దీంతో కొంత కాలంగా ఢీ, జబర్దస్త్ షోలకు రేటింగ్స్ తక్కువగా వస్తున్నాయి. అప్పట్లో నాగబాబు జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పారు. మల్లెమాలపై ఆయన సీరియస్ ఆరోపణలు చేశారు. వారు రెమ్యునరేషన్ తక్కువగా ఇస్తారని.. కనీసం భోజనం కూడా పెట్టించరని మండిపడ్డారు. అయితే నాగబాబు తరువాత మళ్లీ ఇప్పుడే ఈ షోలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.
పేలవంగా ఢీ14..
ఢీ 13 భారీ సక్సెస్‌ను సాధించగా.. తరువాత ఢీ 14 నుంచి జడ్జి పూర్ణ, రష్మి, సుధీర్, దీపికా పిల్లిని తొలగించారు. వాస్తవానికి వీరి కారణంగానే ఢీ 13 సక్సెస్ అయింది. అయినా మల్లెమాల యాజమాన్యం దీనిని గుర్తించలేదు. పోయిన వారిని వెనక్కి రప్పించే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా ప్రస్తుతం ఢీ 14 చప్పగా సాగుతోంది.
Also Read: Major Closing Collections: మేజర్ క్లోసింగ్ కలెక్షన్స్
అదే దారిలో జబర్దస్త్
జబర్దస్త్ నుంచి కూడా స్టార్ కమెడియన్స్ దూరం అయ్యారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోయారు. ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ఆటో రాంప్రసాద్ తన మిత్రులను తలుచుకుని కన్నీరు కూడా పెట్టుకున్నారు. దూరమైన మిత్రులపైనే స్కిట్ చేసి తాను ఎదుర్కొంటున్న ఒంటరితనం గురించి ఉద్వేగానికి లోనయ్యాడు. స్టార్ యాంకర్స్, కమెడియన్లు దూరం కావడంతో కళ తగ్గింది. దీంతో సహజంగానే రేటింట్స్ కూడా తగ్గాయి.
మల్లెమాలను వీడే దారిలో ప్రదీప్..
ఢీ షోకు యాంకర్ ప్రదీప్ కూడా మల్లెమాట ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు త్వరలో గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఢీ 14తో ప్రదీప్ అగ్రిమెంట్ త్వరలో ముగియనుంది. ఈ క్రమంలోనే ఢీ 15లో అతను కనిపించబోవడం లేదని తెలుస్తోంది. ఇప్పడికే అంతంతమాత్రం రేటింగ్‌తో సాగుతున్న ఢీ14 యాంకర్∙ప్రదీప్ కూడా దూరమైతే ఈ షో రేటింగ్స్ మరింత పడిపోతాయని అంటున్నారు అభిమానులు. ఎన్నో ఏళ్లుగా మల్లెమాలతో ఉన్నవారంతా కొన్నిరోజులుగా ఒక్కొక్కరుగా వీడిపోతున్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రెమ్యునరేషన్‌తోపాటు ఇతర విషయాల్లోనూ మల్లెమాల టీమ్ పెద్దగా పట్టించుకోకపోవడమే కారణమని తెలుస్తోంది. అయితే ఇప్పటికైనా జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటారా.. లేదా ఇలాగే నిష్క్రమణల పర్వం కొనసాగుతుందా.. వేచి చూడాలి.
Also Read:Director Harish Shankar: దర్శకుడు హరీష్ శంకర్ కి మండింది… వెధవలు, పనికిమాలినోళ్లు అంటూ..!