NV Ramana key Comments on Judiciary System: ఏపీలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పాటు పర్యటించారు. ఆ పర్యటన ఆదివారంతో ముగిసింది. ఈ మూడు రోజుల పాటు అనేక అనేక కార్యక్రమాల్లో పాల్గొని చాలా బిజీబిజీగా గడిపారు. ఇందులో భాగంగా బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీజేఐకు సన్మానం నిర్వహించారు. ఈ టైంలో ఆయన తన లైఫ్ లో జరిగిన కొన్ని సందర్భాలను వివరించారు. తాను కష్టాల్లో ఉన్న సమయంలో చాలా బార్ కౌన్సిళ్లు, అసోసియేషన్స్ తనకు అండగా నిలిచాయని గుర్తుచేశారు.

వారి సహకారంతోనే తాను నేడు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. ఇప్పటి వరకు బలమైన న్యాయవాద సంఘాలుండేవని చెప్పారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ ను ఎవరైన కించపరిచేలా ప్రవర్తిస్తే వారు సహించేవారు కాదన్నారు. మరి ఇప్పుడు న్యాయవాదుల్లో ఆ చైతన్యం తగ్గిందని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు, న్యాయవ్యవస్థకు సంబంధం లేదని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థను రక్షించుకుని దాని గౌరవాన్ని, కీర్తిని కాపాడుకోవాలని సూచించారు. ఈ బాధ్యత న్యాయవాదులపైనే ఉందన్నారు.
Also Read:<Bandi Sanjay: బండి సంజయ్ ‘దీక్ష’.. తెలంగాణ పీఠం కదిలిస్తాడా?
న్యాయవాదులను న్యాయమూర్తులు గౌరవించాలని, వారికి సంబంధించిన వాదనలను అర్థం చేసుకోవాలని సూచించారు. ఇలా అందరూ సామరస్యంగా ఉంటే న్యాయవ్యవస్థకు గౌరవం పెరుగుందన్నారు ఎన్వీ రమణ. ఇటీవల కాలంలో న్యాయమూర్తులపై దాడులు పెరిగాయని బాధపడ్డారు. కక్షిదారులకు అనువుగా జడ్జిమెంట్ రాకుంటే న్యాయమూర్తులపై విషప్రచారం చేస్తున్నారని మరో ప్రోగ్రామ్ లో ఆయన వివరించారు. ఇలాంటి వాటిని దర్యాప్తును చేసే సంస్థలు సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.
కానీ కోర్టులు జోక్యం చేసుకునే వరకూ అధికారులు స్పందించకపోవడం దురదృష్ణకరమని చెప్పుకొచ్చారు. ఈ విషయాల్లో ప్రభుత్వాలు జోగ్యం చేసుకుని జడ్డీలు, న్యాయవాదులు భయం లేకుండా తమ విధులను నిర్వహించేలా తోడ్పడాలని కోరారు ఎన్వీ రమణ. పేదలకు న్యాయం జరిగేందుకు లాయర్లు కొంత టైంను ఫ్రీ న్యాయసేవ అందించేందుకు కేటాయించాలి అంటూ సూచించారు. తాను విజయవాడ గాలిని పీల్చానని, కృష్ణా నది నీటిని తాగానని ఇక్కడే పెరిగానని చెప్పారు. బెజవాడ ఇచ్చిన ఆత్మ విశ్వాసం, ధైర్యంతో లైఫ్ లో ఎన్నో ఢక్కామొక్కీలను చూసి ఈ స్థాయికి చేరుకున్నట్టు వివరించారు.