https://oktelugu.com/

Kurnool: ముద్దుపెట్టడానికి వచ్చిన భర్త.. కోపంతో భర్త ఆ పార్ట్ కొరికేసిన భార్య.. వైరల్

దాంపత్య జీవితంలో విభేదాలు సహజం. కానీ కొందరు విచిత్రంగా కొట్లాడుకుంటారు. ఒకరిపై ఒకరు విరుచుకుపడుతుంటారు. కానీ భార్యను దగ్గరకు తీసుకున్న ఓ భర్తకు మాత్రం వింత పరిస్థితి ఎదురైంది. ఏకంగా ఆయన నాలుక పోగొట్టుకోవాల్సి వచ్చింది.

Written By:
  • Dharma
  • , Updated On : October 9, 2024 / 01:12 PM IST

    Kurnool

    Follow us on

    Kurnool: రొమాంటిక్ గా భార్యకు ముద్దు పెట్టాలని భావించాడు ఆయన. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె చేసిన పనితో ఆయనకు ప్రాణం పోయినంత పని అయింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎల్లం గుట్ట తండాలో జరిగింది ఈ ఘటన. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పుష్పవత్తులు ప్రేమించుకున్నారు. 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తొలినాళ్లలో వీరి జీవనం సవ్యంగా సాగేది. కొద్దికాలంగా మాత్రంఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో ఏమో కానీ భార్య ఒక్కసారిగా భర్త నాలుక కొరికేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.తన భార్యను దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తే ఇలా నాలుక కొరికేసినట్లు భర్త తారాచందనాయక్ ఆరోపించారు. భార్య ప్రవర్తన కొంతకాలంగా సరిగా లేదని.. గత కొంతకాలంగా వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని భర్త ఆరోపిస్తున్నాడు.

    * ఆవేదనలో భర్త
    తారాచంద్ నాయక్ ఓ షాపులో పనిచేస్తున్నాడు.తన భార్యను బాగానే చూసుకుంటానని చెబుతున్నాడు.నెల నెల జీతం మొత్తం ఆమెకే ఇస్తున్నట్లు చెప్పుకొస్తున్నాడు.అయితే తన భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా మెలుకుతూ తనను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తున్నాడు.తన భార్య నుంచి ప్రాణహాని ఉందని.. తనను చంపేస్తుందేమోనని భయంగా ఉందన్నాడు. తన భార్య ఇలా చేయడం బాధగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన పిల్లల పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

    * ఇష్టం లేనందు వల్లే
    అయితే ఈ ఘటనపై భార్య వేరే విధంగా చెబుతోంది.తన ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించడంతో ఇలా జరిగిందని చెప్పడం విశేషం. పోలీసులు మాత్రం ఇద్దరి నుంచి ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు గుర్తించారు. భర్త నిత్యం అనుమానిస్తుంటాడని.. భార్య ప్రవర్తన కూడా అలానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే భర్త నాలుకను కొరికేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో సైతం వైరల్ అంశంగా మారింది.