Bigg Boss Telugu 8 : గత వారం అమాయకురాలిగా కనపడే విష్ణు చేసిన ఓవర్ యాక్షన్ ని చూసి ఈమెకి కచ్చితంగా నాగార్జున చేతిలో కోటింగ్ పడుతుందని అందరూ అనుకున్నారు. దోశ విషయం లో ఈమె చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. చిన్న విషయానికి పెద్ద డ్రామా చేసి, నాకు ఇష్టంగా దోశ వేయలేదు, జైలులో ఖైదీకి వేసినట్టు గా దోశ వేసింది, బిచ్చగాళ్లకు వేసినట్టు వేసింది అంటూ ఇష్టమొచ్చిన ఆరోపణలు కంటెస్టెంట్స్ అందరి ముందు చేసి పెద్ద సీన్ క్రియేట్ చేసింది. ఈ ఘటన మధ్యలో నాగ మణికంఠ కూడా దూరి లేనిపోనివి కల్పించి చెప్పి ఇంకా పెద్దది చేస్తాడు. ఈ అంశాన్ని తీసుకొస్తాడు నాగార్జున. అయితే ఈ ఘటనలో నాగమణికంఠ ని మందలించడం అవసరమే, కానీ విష్ణు ప్రియ ని ఒక్క మాట కూడా తినకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముందుగా ఆ ఘటన కి సంబంధించిన వీడియో ని వేస్తాడు నాగార్జున.
ఆ వీడియో ని చూపించి నాగ మణికంఠని ప్రశ్న అడుగుతూ ‘అందులో ఆమె దోశ మామూలుగానే వేసింది కదా, ఎందుకు అంత పెద్ద డ్రామా చేసావు’ అని అంటాడు. అప్పుడు నాగ మణికంఠ ‘నాకు ఇష్టంతో దోశ వేసింది అనిపించలేదు సార్. ఎందుకంటే దాని ముందు ప్రేరణ నాతో మాట్లాడిన మాటలను చూస్తే తప్పు ఆమెదే అనిపించింది’ అని అంటాడు. ఆ తర్వాత హౌస్ లో కంటెస్టెంట్స్ అందరినీ అభిప్రాయం అడుగుతాడు నాగార్జున. అందరూ మాకు అందులో ఎలాంటి తప్పు కనిపించలేదు, మామూలుగానే ప్రేరణ దోశ వేసింది అని అంటారు. అప్పుడు నాగార్జున ‘చూసావా మణికంఠ..చాలా చిన్న మ్యాటర్, నువ్వు తలదూర్చి పెద్దది చేసావ్..నీ వల్లే అంత పెద్ద గొడవ జరిగింది’ అని అంటాడు. దీనికి నాగ మణికంఠ బదులిస్తూ ‘దీనిని నేను అంగీకరించను సార్. నా ఉద్దేశ్యం కచ్చితంగా అది కాదు’ అని అంటాడు. చివరికి కన్ఫెషన్ రూమ్ లో తన తప్పుని ఒప్పుకుంటాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ అంత డ్రామా చేసిన విష్ణు ప్రియ ని ఒక్క మాట కూడా తినకపోవడం గమనార్హం.
ఎందుకంటే ఆమె చెప్పమంటేనే నాగ మణికంఠ అక్కడ చూసింది, తనకి అనిపించింది కంటెస్టెంట్స్ తో చెప్తాడు. ఏమి లేని దానిని ప్రేరణ ని చెడు చెయ్యడానికి విష్ణు ప్రియ ఇంత చేసింది అనేది ఆరోజు ఎపిసోడ్ చూసిన ప్రతీ ఒక్కరికి అనిపించింది. అంతే కాదు ఆమె సంఘటన ని మనసులో గుర్తు పెట్టుకొని వారం మొత్తం ప్రేరణపై కోపం చూపించింది. టాస్కులో ఆమెపై ఎన్నో విధాలుగా బౌతికంగా హింసించింది. ఇన్ని చేసిన ఆమె ని నాగార్జున మొక్కుబడిగా కూడా మందలించలేదు. ఇదెక్కడి న్యాయం?, విష్ణు ప్రియ చేసిన తప్పు మొత్తాన్ని మణికంఠ మీదకు నెట్టేశారు. ఇది అన్యాయమే కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నాగార్జున ని ప్రశ్నిస్తున్నారు.