The Ghost Collections: చాలా కాలం తర్వాత అక్కినేని నాగార్జున ఒక పూర్తి స్థాయి లో చేసిన యాక్షన్ సినిమా ‘ది ఘోస్ట్’ ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ చిత్రం పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండేవి..నాగార్జున భారీ హిట్ కొట్టబోతున్నాడు అనే అనుభూతిని కలిగించాయి ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్..కానీ విడుదల తర్వాత ఆ అంచనాలను ఈ చిత్రం ఏ మాత్రం కూడా అందుకోలేకపోయింది..ట్రైలర్ లో చూపించిన విధంగానే యాక్షన్ సన్నివేశాలు సినిమాలో కూడా బాగానే ఆకట్టుకున్నప్పటికీ రొటీన్ కథ అవ్వడం, డైరెక్టర్ థ్రిల్లింగ్ అంశాలను జనరంకంగా చూపించలేకపోవడం వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది..దసరా పండగ సేవలను కూడా ఈ సినిమా ఉపయోగించుకోలేకపోయింది అంటే ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు..ఇప్పటికి ఈ సినిమా విడుదలై 5 రోజులు పూర్తి చేసుకుంది..ఈ 5 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూద్దాము.

మొదటి రోజు ఈ సినిమాకి సుమారు కోటి 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..నాగార్జున గారికి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం ఈ వసూళ్లు డీసెంట్ అనే చెప్పొచ్చు..కానీ దసరా పండగ రోజు ఇలాంటి వసూళ్లు అంటే ట్రేడ్ లెక్కల్లో చాలా తక్కువే అని చెప్పాలి..దానికి తోడు ఈ సినిమా విడుదలైన రోజునే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం విడుదలైంది..దానికి సూపర్ హిట్ టాక్ రావడం..జనాలకు ఆ సినిమానే మొట్టమొదటి ఆప్షన్ అవ్వడం తో ఘోస్ట్ మూవీ వసూళ్ల పై చాలా తీవ్రంగా ప్రభావం పడింది.

మొదటి 5 రోజులకు కలిపి ఈ సినిమా కనీసం 4 కోట్ల రూపాయిల షేర్ ని కూడా వసూలు చేయలేకపోవడం గమనార్హం..బంగార్రాజు సినిమాతో నాగార్జున మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు అనుకున్న అభిమానులకు ఈ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది..సోమవారం నుండి ఇక ఈ సినిమాకి షేర్స్ వచ్చే అవకాశమే కనిపించకపోవడం తో ఇక క్లోసింగ్ కలెక్షన్స్ వేసేయొచ్చు అంటున్నారు ట్రేడ్ పండితులు.