Homeఎంటర్టైన్మెంట్The Ghost Collections: నాగార్జున 'ది ఘోస్ట్' 5 రోజుల వసూళ్లు..ఇది నాగార్జున కి ఘోరమైన...

The Ghost Collections: నాగార్జున ‘ది ఘోస్ట్’ 5 రోజుల వసూళ్లు..ఇది నాగార్జున కి ఘోరమైన అవమానం

The Ghost Collections: చాలా కాలం తర్వాత అక్కినేని నాగార్జున ఒక పూర్తి స్థాయి లో చేసిన యాక్షన్ సినిమా ‘ది ఘోస్ట్’ ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ చిత్రం పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండేవి..నాగార్జున భారీ హిట్ కొట్టబోతున్నాడు అనే అనుభూతిని కలిగించాయి ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్..కానీ విడుదల తర్వాత ఆ అంచనాలను ఈ చిత్రం ఏ మాత్రం కూడా అందుకోలేకపోయింది..ట్రైలర్ లో చూపించిన […]

The Ghost Collections: చాలా కాలం తర్వాత అక్కినేని నాగార్జున ఒక పూర్తి స్థాయి లో చేసిన యాక్షన్ సినిమా ‘ది ఘోస్ట్’ ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ చిత్రం పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండేవి..నాగార్జున భారీ హిట్ కొట్టబోతున్నాడు అనే అనుభూతిని కలిగించాయి ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్..కానీ విడుదల తర్వాత ఆ అంచనాలను ఈ చిత్రం ఏ మాత్రం కూడా అందుకోలేకపోయింది..ట్రైలర్ లో చూపించిన విధంగానే యాక్షన్ సన్నివేశాలు సినిమాలో కూడా బాగానే ఆకట్టుకున్నప్పటికీ రొటీన్ కథ అవ్వడం, డైరెక్టర్ థ్రిల్లింగ్ అంశాలను జనరంకంగా చూపించలేకపోవడం వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది..దసరా పండగ సేవలను కూడా ఈ సినిమా ఉపయోగించుకోలేకపోయింది అంటే ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు..ఇప్పటికి ఈ సినిమా విడుదలై 5 రోజులు పూర్తి చేసుకుంది..ఈ 5 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూద్దాము.

The Ghost Collections
nagarjuna

మొదటి రోజు ఈ సినిమాకి సుమారు కోటి 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..నాగార్జున గారికి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం ఈ వసూళ్లు డీసెంట్ అనే చెప్పొచ్చు..కానీ దసరా పండగ రోజు ఇలాంటి వసూళ్లు అంటే ట్రేడ్ లెక్కల్లో చాలా తక్కువే అని చెప్పాలి..దానికి తోడు ఈ సినిమా విడుదలైన రోజునే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం విడుదలైంది..దానికి సూపర్ హిట్ టాక్ రావడం..జనాలకు ఆ సినిమానే మొట్టమొదటి ఆప్షన్ అవ్వడం తో ఘోస్ట్ మూవీ వసూళ్ల పై చాలా తీవ్రంగా ప్రభావం పడింది.

The Ghost Collections
nagarjuna

మొదటి 5 రోజులకు కలిపి ఈ సినిమా కనీసం 4 కోట్ల రూపాయిల షేర్ ని కూడా వసూలు చేయలేకపోవడం గమనార్హం..బంగార్రాజు సినిమాతో నాగార్జున మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు అనుకున్న అభిమానులకు ఈ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది..సోమవారం నుండి ఇక ఈ సినిమాకి షేర్స్ వచ్చే అవకాశమే కనిపించకపోవడం తో ఇక క్లోసింగ్ కలెక్షన్స్ వేసేయొచ్చు అంటున్నారు ట్రేడ్ పండితులు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper