Homeఎంటర్టైన్మెంట్Happy birthday Nagarjuna: రెండు తరాల కలల రాకుమారుడు 'నాగార్జున' !

Happy birthday Nagarjuna: రెండు తరాల కలల రాకుమారుడు ‘నాగార్జున’ !

Happy birthday Nagarjuna

Happy birthday Nagarjuna:  అక్కినేని నాగార్జున.. ఆరు పదుల వయసులో కూడా టాలీవుడ్‌ ‘మన్మథుడు’ అనిపించుకుంటున్న ఏకైక హీరో. నేడు నాగార్జున పుట్టినరోజు. రొమాంటిక్‌ హీరోగా ఒక ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని, ఆ ఇమేజ్ ను ముప్పై ఐదేళ్లుగా బ్యాలెన్స్‌ చేస్తూ.. రెండు తరాల మహిళలకు కలల రాకుమారుడిగా నాగార్జున తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ ను క్రియేట్ చేసుకున్నాడు.

నాగార్జున అంటే ఒక సినిమాలే కాదు, గ్రేట్ బిజినెస్ మెన్ కూడా. మా టీవీలో పెట్టుబడులు పెట్టి, మా టీవీ రేంజ్‌ ను పెంచాడు. ఇక నాగార్జున చేసిన యాడ్స్… కళ్యాణ్‌ జువెల్లర్స్‌, సౌతిండియా షాపింగ్‌మాల్‌, ఘడీ డిటర్జెంట్‌తో పాటు స్పోటి ఫై లాంటి ఎనర్జిటిక్‌ యాడ్‌ లు కూడా బాగా వైరల్ అయ్యాయి.

ఇక నాగ్ గేమ్స్ లో కూడా ఇన్ వాల్వ్ అయ్యాడు. హీరోగా కొనసాగుతూనే అనేక జట్లకు సహ యజమానిగా పెట్టుబడులు పెట్టాడు. ఈ క్రమంలోనే ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ ‘ముంబై మాస్టర్స్‌’కు సునీల్‌ గవాస్కర్‌ తో కలిసి పెట్టుబడులు పెట్టాడు. అలాగే ధోనీతో కలిసి మహీ రేసింగ్‌ టీం ఇండియాకు కూడా పెట్టుబడులు పెట్టాడు. ఇక ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ క్లబ్‌ లో కేరళ బ్లాస్టర్‌ ఎఫ్‌సీ కి కూడా నాగార్జున సహ యాజమానిగా ఉన్నాడు.

కాగా అక్కినేని నాగార్జున గతంలో రెండుసార్లు ఫోర్బ్స్‌ టాప్‌ 100 సెలబ్రిటీల లిస్ట్‌లో కూడా చోటు సంపాదించడం విశేషం. ఏది ఏమైనా తెలుగుతెరపై చెరిగిపోని ముద్రవేశాడు నాగ్. లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకుని.. తెలుగు స్టార్ హీరోల్లో ఒకడిగా నాగార్జున విజయవంతం అయ్యాడు.

నాగార్జున ఏయన్నార్‌ ‘సుడిగుండాలు’ చిత్రంలో బాలనటుడిగా చేశాడు. అలాగే ప్రొడక్షన్‌ కంపెనీ అన్నపూర్ణ స్టూడియోస్‌ కి నాగార్జున అక్కినేని కో-ఓనర్‌ గా వ్యవహరిస్తున్నాడు. ఇక తన సతీమణి అమల అక్కినేనితో కలిసి బ్లూ క్రాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఎన్జీవోను కూడా నడిపిస్తున్నారు. మా ఓకే తెలుగు తరపున నాగార్జునకి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version