https://oktelugu.com/

Nagarjuna: బాలయ్యతో మల్టీస్టారర్ ఆ స్టార్ హీరో చెడగొట్టాడన్న నాగ్, వారి కాంబోలో మిస్ అయిన మూవీ ఏమిటో తెలుసా?

Nagarjuna ఎన్టీఆర్-ఏఎన్నార్ ల కాంబోలో అనేక క్లాసిక్స్ తెరకెక్కాయి. వీరి వారసులు బాలకృష్ణ, నాగార్జున మాత్రం ఒక్క మల్టీస్టారర్ కూడా చేయలేదు. అయితే అందుకు వీరిద్దరూ సిద్ధం కాగా ఓ స్టార్ హీరో చెడగొట్టాడట. ఆ హీరో ఎవరో నాగార్జున ఓపెన్ గా చెప్పాడు.

Written By: , Updated On : March 31, 2025 / 10:11 AM IST
Nagarjuna (1)

Nagarjuna (1)

Follow us on

Nagarjuna: తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళు అంటారు. వీరిద్దరూ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేశారు. కాగా ఎన్టీఆర్-ఏఎన్నార్ కాంబోలో క్లాసిక్స్ తెరకెక్కాయి. మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మకథ వంటి ఆల్ టైం క్లాసిక్స్ ని ఎన్టీఆర్-ఏఎన్నార్ అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేరు. పదుల సంఖ్యలో ఈ లెజెండ్స్ మల్టీస్టారర్స్ చేశారు. కాగా వారి వారసులు బాలకృష్ణ-నాగార్జున ఒక్క మల్టీస్టారర్ కూడా చేయకపోవడం బాధాకరం. దశాబ్దాలుగా అభిమానుల్లో ఈ అసంతృప్తి నెలకొని ఉంది. అయితే బాలకృష్ణ, నాగార్జున కలిసి ఒక సినిమా చేసేందుకు సిద్దమయ్యారట.

Also Read: పూరీ,ఛార్మి చేతుల్లో మరో హీరో బలి..? ఫోటోకే వణికిపోతున్న ఫ్యాన్స్!

గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలయ్యతో మీరు ఒక్క మల్టీస్టారర్ కూడా ఎందుకు చేయలేదు అని నాగార్జునను అడగ్గా… ఒక రోజు బాలకృష్ణ నాకు చుప్ కే చుప్ కే మూవీ సీడీ పంపారు. అది అమితాబ్, ధర్మేంద్ర నటించిన భారీ హిట్ మూవీ. ఆ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ రీమేక్ మనం చేద్దాం అని బాలయ్య అన్నాడు. అందుకు నేను కూడా అంగీకరించాను. అయితే ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ కి తెలిసింది. ఎన్టీఆర్ నాకు ఫోన్ చేసి.. బాబాయ్, నేను నాగ చైతన్య కలిసి గుండమ్మ కథ చేయాలి అనుకుంటున్నాం. బాలయ్యతో మీరు మల్టీస్టారర్ చేస్తే.. మా ప్రయత్నం దెబ్బ తింటుంది. మీరు ఆ ఆలోచన మానుకోండి అన్నారు.

దాంతో బాలయ్యతో నేను చేయాలి అనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోయింది.. అని నాగార్జున చెప్పుకొచ్చారు. అయితే గుండమ్మ కథ చేయడం అంత సులభం కాదు. బాలయ్యతో నేను గుండమ్మ కథ చేయాలనే ప్రతిపాదన ఉంది. కానీ గుండమ్మ కథ వంటి క్లాసిక్ ని టచ్ చేయకపోవడం మంచిదనే ఆలోచనతో వదిలేశాను, అని నాగార్జున వెల్లడించారు. కాగా ఇటు చుప్ కే చుప్ కే రీమేక్ చేయాలన్న బాలయ్య-నాగార్జునల ఆలోచనకు అడ్డు కట్ట వేసిన బాలకృష్ణ అటు.. నాగ చైతన్యతో గుండమ్మ కథ కూడా చేయలేదు. ఇకపై ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందన్న ఆశ ప్రేక్షకుల్లో లేదు. మారిన సమీకరణాల రీత్యా స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు.

అయితే దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిన ఊపిరి మూవీలో ఎన్టీఆర్ నటించాల్సింది. మాస్ ఇమేజ్ ఉన్న తనకు ఆ పాత్ర సెట్ కాదని ఎన్టీఆర్ తిరస్కరించాడు. అప్పుడు హీరో కార్తీ ఆ పాత్ర చేశాడు. ఊపిరి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.