Puri Jagannadh , Charmy Kaur
Puri Jagannadh and Charmy Kaur : ఒక హీరో కి ఊర మాస్ ఇమేజ్ రావాలంటే కచ్చితంగా పూరి జగన్నాథ్(Puri Jagannath) తో ఒక సినిమా చేయాల్సిందే అని అభిమానులు ఒకప్పుడు కోరుకునేవారు. పూరి జగన్నాథ్ మార్క్ డైలాగ్స్, హీరోయిజం అంటే ఆడియన్స్ కి అంత పిచ్చి. మహేష్ బాబు(Superstar Mahesh babu), పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan), ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Global Star Ram Charan), ప్రభాస్(Rebel Star Prabhas), అల్లు అర్జున్(Icon star Allu Arjun) ఇలా ప్రతీ స్టార్ హీరోకు ఒక సరికొత్త ఇమేజ్ ని తెచ్చిపెట్టిన డైరెక్టర్ ఆయన. కేవలం లవ్ స్టోరీస్ తో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ ని ‘బద్రి’ చిత్రం లో సరికొత్త గా చూపించి, ఆయనకు ఊర మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాడు పూరి జగన్నాథ్. అదే విధంగా సాఫ్ట్ రోల్స్ చేస్తూ వచ్చిన మహేష్ బాబు ని కనివిని ఎరుగని మాస్ రోల్ లో చూపించి పోకిరి తో సౌత్ ఇండియానే షేక్ చేసి వదిలాడు.
Also Read : పూరి ఛార్మీ ని వదిలేస్తే ఆమెకి ఎంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో తెలుసా..?
అలాంటి సత్తా ఉన్న పూరి జగన్నాథ్ ఇప్పుడు ఎలా తయారయ్యాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన గత చిత్రాలను చూస్తే పూరి తో అత్యంత సన్నిహితంగా ఉండే హీరోలు కూడా సినిమాలు చేయడానికి భయపడతారు. అలాంటి ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. అంతకు ముందు పూరి జగన్నాథ్ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ, డైలాగ్స్ గురించి, స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకునే వాళ్ళు ఆడియన్స్. కానీ ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి చిత్రాలు చూసిన తర్వాత పూరి జగన్నాథ్ బుర్ర పూర్తిగా చెడిపోయింది, ఇక ఆయన డైరెక్టర్ గా పనికిరాడు అనే ఉద్దేశ్యానికి వచ్చేసారు ఆడియన్స్. హీరోలు ఈయనని చూస్తేనే భయపడి పారిపోయే పరిస్థితులు ఉన్న ఈరోజుల్లో, తమిళ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఒక సినిమా చేయడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన గ్రాండ్ గా చేసారు. ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.
ఈ టైటిల్ ని విన్న తర్వాత సోషల్ మీడియా లో నెటిజెన్స్ సినిమా విడుదల తర్వాత పూరి జగన్నాథ్ పరిస్థితి అదే అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈమధ్య కాలం లో పూరి జగన్నాథ్ హీరోయిన్ ఛార్మి తో పార్టనర్ షిప్ కట్ చేసుకున్నాడని, ఇక నుండి ఆయన తాను దర్శకత్వం వహించే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడని, కేవలం ఇతర నిర్మాణ సంస్థల్లోనే పని చేస్తాడని, ఇలా ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవని ఈరోజు విడుదలైన ఫోటో ని చూసి క్లారిటీ వచ్చింది. ఈ ఫొటోలో విజయ్ సేతుపతి తో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి ఉన్నారు. విజయ్ సేతుపతి ని చూసి ఆడియన్స్ పాపం ఇప్పుడిప్పుడే కెరీర్ లో వరుస హిట్స్ ని అందుకుంటున్నాడు, ఇప్పుడు వీళ్ళ చేతిలో పడ్డాడు, కెరీర్ మటాష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పూరి జగన్నాథ్ కం బ్యాక్ ఎప్పుడు ఊరమస్ లెవెల్ లోనే ఉంటుంది. వరుస ఫెయిల్యూర్స్ ఎదురుకుంటున్న రోజుల్లోనే ఆయన ‘ఇష్మార్ట్ శంకర్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఏమో ఈ సినిమాతో మళ్ళీ ఆయన అలాంటి కం బ్యాక్ ఇవ్వచ్చేమో చూద్దాం.
Also Read : లైగర్ ఎఫెక్ట్… ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన ఛార్మి, ఆమెలో ఈ మార్పు గమనించారా?