Anirudh Ravichander
Anirudh Ravichander : సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవతరించాడు అనిరుధ్ రవిచంద్రన్. ఈ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సౌత్ టు నార్త్ దున్నేస్తున్నాడు. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ఆ మూవీ వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ విధంగా హిందీలో కూడా తన మార్క్ క్రియేట్ చేశాడు. ఇక తెలుగులో దేవరతో భారీ విజయం అందుకున్నాడు. దేవర వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దేవర విజయంలో అనిరుధ్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది.
Also Read : దేవర సక్సెస్ అయింది…మరి ఇప్పుడైనా అనిరుధ్ కి తెలుగు లో అవకాశాలు వస్తాయా..?
తెలుగులో కూడా బిజీ అవుతున్న అనిరుధ్ పలు సినిమాలకు పని చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్, నాని హీరోగా తెరకెక్కుతున్న పారడైజ్ చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రతిభ గల మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ తరచుగా ఎఫైర్ రూమర్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. అప్పట్లో సుచి లీక్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. పలువురు కోలీవుడ్ ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు నెట్లో హల్చల్ చేశాయి. వారిలో అనిరుధ్ కూడా ఉన్నాడు. నటి ఆండ్రియా తో సన్నిహితంగా ఉన్న అనిరుధ్ ఫోటోలు బయటకు వచ్చాయి.
ఇటీవల హీరోయిన్ కీర్తి సురేష్ తో రిలేషన్ నడిపాడంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లకు చెక్ పెడుతూ కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకుంది. తాజాగా అనిరుధ్ ఓ ఐపీఎల్ సెలెబ్రిటీకి దగ్గరయ్యాడని అంటున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ ఐపీఎల్ ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. తన టీం ఆడేటప్పుడు ఆమె టెలివిజన్ లో హైలెట్ అవుతూ ఉంటుంది. గెలుపు ఓటముల్లో ఆమె హావభావాలను కెమెరా మెన్ ప్రత్యేకంగా చిత్రీకరిస్తూ ఉంటారు. కావ్య మారన్ కి భారీ ఫ్యాన్ బేస్ ఉంది.
కావ్య మారన్ తమిళనాడు అమ్మాయి. కాగా కావ్య మారన్ తో అనిరుధ్ ప్రేమలో ఉన్నాడట. కోలీవుడ్ మీడియాలో ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను అనిరుధ్ టీమ్ ఖండించినట్లు సమాచారం. అనిరుధ్-కావ్య మంచి మిత్రలు. వారి మధ్య ఎప్పటి నుండో స్నేహం ఉంది. అంతే కానీ ప్రేమించుకుంటున్నారనే పుకార్లలో నిజం లేదని వారు అస్పష్టత ఇచ్చారు. ఇక వాస్తవం ఏమిటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Also Read : రజినీకాంత్ కి ధనుష్ అల్లుడు అవుతాడు..? మరి అనిరుధ్ ఏం అవుతాడు..?