Rajamouli Mahesh Babu Movie: ఒక సినిమాని ప్రేక్షకుడికి నచ్చే విధంగా తీయాలి అంటే దర్శకుల వల్లే అవుతుంది. కొంతమంది డైరెక్టర్స్ ఏ జానర్ లో సినిమా తీసిన కూడా వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది. అలాంటి వాళ్లలో రాజమౌళి మొదటి స్థానం లో ఉంటాడు. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇప్పటివరకు మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాయి.
ఇక అలాంటి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు ను హీరోగా పెట్టి ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే రీసెంట్ గా మహేష్ బాబు జర్మనీ నుంచి తిరిగి వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక అందులో భాగంగానే మహేష్ బాబు లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పటివరకు ఎప్పుడూ మహేష్ బాబు అలాంటి లుక్ లో కనిపించలేదు. కాబట్టి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసమే మహేష్ బాబు అలాంటి లుక్ లోకి మారిపోయాడని తెలుస్తుంది.
ఇక ఇలాంటి క్రమం లోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాలో నాగార్జున కూడా నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన పాత్ర ఏంటి అంటే మహేష్ బాబుకి అన్న గా నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మహేష్ బాబు కి అన్న పాత్రలో నాగార్జున సెట్ అవుతాడా అని మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే తనుకు సపరేట్ గా ఒక స్టోరీ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే వెంకటేష్ మహేష్ బాబు అన్నగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మరి ఇప్పుడు నాగార్జున కూడా మహేష్ బాబుకు అన్నగా చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంటాడో లేదో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక రీసెంట్ గా నాగార్జునకి సరైన సక్సెస్ లు కూడా ఏమీ లేవు. కాబట్టి తను కూడా ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమా క్యాస్టింగ్ ను సెలెక్ట్ చేసే పని లో ఉన్నట్టు గా తెలుస్తుంది…