Nagarjuna New Roles: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు కేవలం హీరో పాత్రలను మాత్రమే చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని చూస్తుంటారు. ఒకవేళ డిఫరెంట్ పాత్రలను ట్రై చేసిన కూడా ప్రేక్షకుల్లో తమకున్న ఇమేజ్ తగ్గిపోతుందని అలాగే తమ మార్కెట్ పడిపోతుందనే ఉద్దేశ్యంతో ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా కేవలం హీరోలుగా మాత్రమే సినిమాలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే నాగార్జున లాంటి నటుడు ఇప్పుడు వైవిద్య భరితమైన పాత్రలను పోషిస్తున్నాడు. ఈ సంవత్సరంలోనే ‘కుబేర’ సినిమాతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు. అలాగే కూలీ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే నాగార్జున కోసం మరికొన్ని పాత్రలను రెడీ చేస్తున్నట్టుగా మన దర్శకులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టాయి. అయినప్పటికీ ఆయన విలన్ పాత్రలవైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాంటి పాత్రలు చేసినప్పుడే నటించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని అలాంటి పాత్రలు చేస్తున్నాడట. ఇక ఇప్పటివరకు హీరోగా ఆయన చేసిన పాత్రలన్ని ఒకేతయితే ఇప్పుడు విలనిజాన్ని పండించే పాత్రలు తనకు స్పెషల్ గుర్తింపు తీసుకొస్తాయనే ఉద్దేశ్యంతో నాగార్జున ఉన్నాడు. అందువల్లే ఆయన మంచి క్యారెక్టర్స్ ను ఎంచుకొని సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అతన్ని దృష్టిలో పెట్టుకొని మరి కొంతమంది స్టార్ డైరెక్టర్లు సైతం విలన్ పాత్రలను చాలా స్పెషల్ గా ఉండే విధంగా డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి నాగార్జున ఇకమీదట కూడా అలాంటి పాత్రను పోషిస్తాడా లేదంటే ఇప్పటితో అలాంటి పాత్రలను చేయడం ఆపేస్తాడా? కేవలం హీరోగా మాత్రమే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగాలని చూస్తున్నాడా?
Also Read: తెలుగు హీరోలకు దెబ్బేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్స్…
అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు వాళ్ళు చేసిన సినిమాలతో వాళ్లను వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇక మీదట నుంచి వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ముఖ్యంగా నాగర్జున తన 100 వ సినిమా గురించి ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు. ఇక ఇప్పటికే దర్శకుడిని కన్ఫర్మ్ చేశాను అంటూ కొన్ని వార్తలను అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. కగట రెండు సంవత్సరాల నుంచి ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అయిన కూడా అది ఏ మాత్రం వర్కౌట్ అయితే అవ్వలేదు.
Also Read: టాలీవుడ్ ఆశలన్నీ ఇక ‘ఓజీ’ పైనే..డైరెక్టర్ సుజిత్ ని నమ్మొచ్చా?
మరి ఈ సినిమా ఎప్పుడు కన్ఫర్మ్ అవుతోంది. ఎప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకి వెళుతోంది. ఎప్పుడు రిలీజ్ అవుతోంది అనే దాని మీదనే ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. మరి వాటికి పులిస్టాప్ పెడుతూ నాగార్జున ఈ సినిమా మీద త్వరలోనే అప్డేట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది…