Narendra Modi Pakistan: పాకిస్తాన్ మీద అంతకంతకు ఒత్తిడి తీసుకురావడానికి.. పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత నరేంద్ర మోడీ పాకిస్తాన్ దేశానికి మరింత తీవ్రంగా చుక్కలు చూపించడానికి రెడీ అయిపోయారు. పాకిస్తాన్ విషయంలో తాము ఏం చేస్తామో.. ఏం చేయబోతామో.. ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర వేడుకల్లో నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత సింధు నది మీద డ్యాములు కట్టాలని.. ఆ నీటిని మొత్తం మన దేశం వినియోగించుకునే విధంగా భారత్ అనేక రూపకల్పనలు, ప్రణాళికలు చేస్తాది. ఇండియా పాకిస్తాన్ భారత్ సింధూ నది మీద ఒకవేళ ప్రాజెక్టులు కడితే తాము కూల్చివేస్తామని.. భారత దేశంలో తీవ్ర పరిణామాలకు కారణమవుతామని దాయాది దేశ సైన్యాధ్యక్షుడు హెచ్చరించారు. అమెరికా పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే దాయాది దేశ సైన్యాధ్యక్షుడు ఆ వ్యాఖ్యలు చేశారో.. భారత్ వేగంగానే స్పందించింది. దాయాది దేశం ఇన్ని రోజులుగా వినియోగించుకున్న నది జలాల మీద తాము ప్రాజెక్టులు కడతామని.. వీటిని వినియోగించుకుంటామని.. డ్యాముల విషయంలో ఏదైనా చేస్తే దాయాది దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ఏ దేశం కూడా మా నుంచి దాయాది దేశాన్ని రక్షించలేదని భారత్ హెచ్చరించింది. ఒక రకంగా పాకిస్తాన్ కు మాత్రమే కాదు.. ఈ హెచ్చరికలను అమెరికాకు కూడా వర్తిస్తాయని భారత్ పరోక్షంగా చెప్పింది.
Also Read: ఎర్రకోట నుంచి నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్..
ఎర్రకోట వేదికగా జరుగుతున్న స్వాతంత్ర వేడుకల్లోనూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు..” రక్తం నీళ్లు కలసి ప్రవహించలేవు. సింధు నది విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేసేది లేదు. నదీ జలాలను నూటికి నూరు శాతం వినియోగించుకుంటాం. ఇందులో ఏ శక్తి మాకు వ్యతిరేకంగా ఉండదు. ఒకవేళ ఉంటే అడుగుదాకా తొక్కేస్తాం. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. మా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే కచ్చితంగా కఠిన నిర్ణయం తీసుకుంటాం. ఉగ్రవాదులను మాత్రమే కాదు.. ఉగ్రవాదులకు సహకరించి వ్యక్తులను కూడా మేము అదే విధంగా పరిగణిస్తాం. సింధు నది మీద మాకు పూర్తిగా హక్కులు ఉన్నాయి. కచ్చితంగా డ్యాములు కడతాం. నీటిని వినియోగించుకుంటాం. మా దేశ రైతుల ప్రయోజనాలను మేము కాపాడుకుంటాం. మా దేశ సౌభాగ్యం.. దేశ ప్రయోజనాలు మాత్రమే మాకు ముఖ్యం. అంతే తప్ప ఇష్టానుసారంగా వ్యవహరించి.. మా నీళ్లను వాడుకుంటామంటే కుదరదు. ఇతరులపై ఆధారపడే స్థితిలో భారత్ లేదు. ఏ వ్యవస్థ మమ్మల్ని నియంత్రించలేదు. ఉగ్రవాదులను తుడిచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంటామని” నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తన వ్యాఖ్యల ద్వారా ప్రపంచ దేశాల మీద పెత్తనం చేస్తున్న శ్వేత దేశానికి , ఆ దేశం అండ చూసుకొని విర్రవీగుతున్న దాయాది దేశానికి ఏకకాలంలో భారత ప్రధాని హెచ్చరికలు జారీ చేశారు.
Addressing the nation on Independence Day. https://t.co/rsFUG7q6eP
— Narendra Modi (@narendramodi) August 15, 2025