Bollywood directors vs Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు ఇండియాలో వాళ్ళ సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో వివిధ భాషల నుంచి చాలామంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసినప్పటికి ఎవ్వరికీ దక్కనటువంటి క్రేజ్ మన హీరోలకు మాత్రమే దక్కుతోంది. ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఎక్కువ సంఖ్య సినిమాలను రిలీజ్ చేసిన హీరోలు కూడా మనవాళ్లే కావడం విశేషం…ఇక రాబోయే సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్న మన స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోల హవా ఎక్కువైపోతోంది అని చాలా మంది కుళ్ళు కుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మన హీరోలతో విలన్ పాత్రలను చేయించడం లేదంటే మన హీరోల క్రేజ్ తగ్గించడానికి బాలీవుడ్ దర్శకులు మన వాళ్ళతో సినిమాలను చేసి కావాలనే ప్లాప్ లను మూటగట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ప్రభాస్ హీరోగా ఓం రావత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ సినిమా భారీ ప్లాప్ ను మూటగట్టుకుంది. ఇప్పుడు అయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన వార్ 2 సినిమా సైతం తెలుగు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.
Also Read: టాలీవుడ్ ఆశలన్నీ ఇక ‘ఓజీ’ పైనే..డైరెక్టర్ సుజిత్ ని నమ్మొచ్చా?
అలాగే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఈ సినిమాలో పెద్దగా ప్రేక్షకులు ఆకట్టుకోలేదని అతని అభిమానులు సైతం తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు… మరి ఇలాంటి సందర్బంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. దానిని తగ్గిస్తూ ఈ సినిమా తీశారు అంటూ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇకమీదట బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయకుండా ఉంటే మంచిదని మన తెలుగు హీరోలకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలువురు పెద్దలు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు హీరోల హవా ఎక్కువవుతున్న నేపథ్యంలో తెలుగులో చాలామంది దర్శకులు పాన్ ఇండియా డైరెక్టర్లుగా ఎదుగుతున్నారు.
Also Read: ‘ప్యారడైజ్’ లో నాని ని వెన్నుపోటు పొడిచేది ఎవరో తెలుసా..?
మరి ఇక్కడి వాళ్ళను నమ్ముకొని సినిమాలు చేసుకుంటే మంచిదని బాలీవుడ్ దర్శకులను నమ్మి మోసపోవడం మంచిది కాదని హీరోలు సైతం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అందువల్లే ఇక మీదట బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేసే ఛాన్స్ లేదని మన స్టార్ హీరోలు తెగేసి చెబుతున్నారు…