Pawan Kalyan OG: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అసలు కలిసి రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏడాది ప్రారంభంలో రామ్ చరణ్(Megastar Chiranjeevi) ‘గేమ్ చేంజర్'(Game Changer) చిత్రం భారీగా నిరాశపర్చిన, ఆ తర్వాత రెండు రోజులకే విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బయ్యర్స్ ని కాపాడింది. ఇక ఆ పక్క రోజు విడుదలైన బాలకృష్ణ డాకు మహారాజ్ చిత్రం కూడా పర్వాలేదు అనే రేంజ్ లోనే వసూళ్లను రాబట్టింది. ఒక్క నెలలో రెండు హిట్స్ వచ్చాయి, ఈ ఏడాది టాలీవుడ్ కి మహర్దశ నడుస్తుందేమో అని అంతా ఆశపడ్డారు. రెండవ నెల ఫిబ్రవరి లో కూడా ‘తండేల్’ చిత్రం పెద్ద కమర్షియల్ హిట్ అవ్వడం తో ఆశలు పదిలంగా ఉండేవి. కానీ ఆ తర్వాత విడుదలైన సినిమాలు మాత్రం ఒక్కొక్కటిగా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి.
Also Read: ‘వార్ 2’ కి తెలుగు లో ‘కింగ్డమ్’ కంటే తక్కువ ఓపెనింగ్స్..ఎన్టీఆర్ కి ఘోరమైన అవమానం!
మధ్యలో వచ్చిన ‘కోర్ట్’ , ‘సింగిల్’ వంటి చిన్న చిత్రాలు, ‘డ్రాగన్’, ‘మహావతార్ నరసింహా’ వంటి డబ్బింగ్ చిత్రాలు భారీ లాభాలను రాబట్టాయి. కానీ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రాలు భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాల కారణంగా బయ్యర్స్ చాలా నష్టపోయారు. ఇక నేడు విడువులైన ‘కూలీ’ , ‘వార్ 2’ చిత్రాలు అయినా మన టాలీవుడ్ ని కాపాడుతాయేమో అని అనుకుంటే, ఈ రెండు సినిమాలకు కూడా టాక్ రాలేదు. మహా అయితే వీకెండ్ వారుకు బాగా వసూళ్లు రావొచ్చు, సోమవారం నుండి మళ్ళీ థియేటర్స్ ని ఖాళీగా పెట్టుకోవాల్సిందే. గత ఏడాది విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిల్చి సుమారుగా నెల రోజుల పాటు థియేటర్స్ ని కళకళలాడేలా చేశాయి. మూత పడాల్సిన ఎన్నో సింగల్ స్క్రీన్స్ ని ఈ రెండు చిత్రాలు రక్షించాయి.
ఇప్పుడు అలాంటి సూపర్ హిట్ సినిమా మన టాలీవుడ్ కి కావాలి, లేకపోతే ఏడాది ముగిసేలోపు అనేక సింగల్ స్క్రీన్ థియేటర్స్ ని మూసివేయడం మనం చూడాల్సి వస్తుంది. అలా సింగల్ స్క్రీన్స్ ని కాపాడే చిత్రం దగ్గర్లో ఏదైనా ఉందా అంటే అది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం మాత్రమే. ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ జానీ, జల్సా చిత్రాలకు ఎలాంటి క్రేజ్ ఉండేదో, ఈ చిత్రానికి అలాంటి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ అయినా గ్లింప్స్ వీడియో, ఫైర్ స్ట్రోమ్ పాట సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి. యూత్ ఆడియన్స్ లో మరింత అంచనాలు పెంచాయి, త్వరలో టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నారు. ఇలా ఈ చిత్రం నుండి వచ్చే ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ క్రేజీ గా ఉండబోతుంది. అంచనాలు తారాస్థాయికి చేరిపోతాయి, ఆ అంచనాలకు తగ్గ సినిమా ఇస్తే మాత్రం నెల రోజులు థియేటర్స్ కి పండగే పండగ, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.