PKSDT : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ఏదైనా ఉందా అంటే అది #PKSDT మూవీ అని చెప్పొచ్చు. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర పేరు ‘టైం’ , ఇక ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పాత్ర పేరు ‘మార్కండేయ’.
వీళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయట. ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించాడు. జులై 28 వ తారీఖున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా టైటిల్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా రోజుల నుండి ప్రొడక్షన్ టీం తో పెద్ద యుద్ధమే చేస్తున్నారు.
కానీ ప్రొడక్షన్ టీం మాత్రం ప్రస్తుతం తమ సంస్థ నుండి విడుదల అవ్వబోతున్న ‘రామబాణం’ చిత్రం ప్రొమోషన్స్ పైనే ప్రధాన ద్రుష్టి పెట్టింది.ఈ చిత్రం విడుదలైన తర్వాతే #PKSDT టైటిల్ చెప్తారని తెలుస్తుంది. అయితే సోషల్ మీడియా కారణంగా ప్రతీ విషయం ముందే తెలిసిపోతుంది, అలాగే ఈ సినిమా టైటిల్ కూడా ఇదేనంటూ ఒక ప్రచారం సాగుతుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం.
ఈ టైటిల్ వినగానే అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రం సంతోషం లోని పాట గుర్తుకొచ్చింది కదూ?, సినిమా కథకి ఈ టైటిల్ తప్ప మరో టైటిల్ ఏది కూడా సరితూగడం లేదని, అందుకే ఈ టైటిల్ ని పెట్టినట్టు చెప్తున్నారు, మరి టైటిల్ నిజంగే ఇదేనా, లేదా వేరే టైటిల్ ని నిర్ణయించారా అనేది తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.