https://oktelugu.com/

Viral : లేటు వయసులో ఘాటు ప్రేమ: పదిమంది పిల్లల తల్లి ప్రియుడితో జంప్: తర్వాత ఏం జరిగిందంటే?

సోనీ, బాలేంద్ర విషయం గ్రామస్తులకు తెలియడంతో ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. పదిమంది పిల్లలకు కొత్త జీవితం ప్రసాదించాలని భావించారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2023 / 10:46 PM IST
    Follow us on

    Extramarital affairs :   “పెళ్లంటే నూరేళ్లపంట. భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండాలి. కుటుంబం పదికాలాలపాటు వర్ధిల్లాలి” పెళ్లి సమయంలో ఇలానే మన పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు. వివాహాన్ని ఘనంగా జరుపుతారు. కానీ ఉత్తర ప్రదేశ్ లో పై దీవెనలు ఇచ్చారో లేదో తెలియదు కానీ సభ్య సమాజం ఆశ్చర్యపోయే వివాహం జరిపించారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

    ఏం జరిగిందంటే

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరక్ పూర్ జిల్లా బహల్ గంజ్ ప్రాంతంలో దాద్రి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో సోనీ శర్మ(42) అనే మహిళ భర్త ఆరు సంవత్సరాల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటికే వీరికి పదిమంది పిల్లలు ఉన్నారు. భర్త చనిపోయిన తర్వాత డియో రియా జిల్లా నకైల్ గ్రామానికి చెందిన బాలేంద్ర యాదవ్ అనే 40 సంవత్సరాల వ్యక్తితో సోనీ శర్మకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. అయితే బాలేంద్ర యాదవ్ అవివాహితుడు. అతనితో కలిసి సోనీ ఏడాది కిందట నలుగురు పిల్లల్ని వెంట తీసుకెళ్లి పారిపోయింది. మిగతా పిల్లల్ని స్వగ్రామంలో వదిలిపెట్టింది. అయితే అప్పుడప్పుడు దాద్రి గ్రామానికి వచ్చి తన పిల్లల చూసుకుంటుంది. అయితే సోనీ, బాలేంద్ర విషయం గ్రామస్తులకు తెలియడంతో ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. పదిమంది పిల్లలకు కొత్త జీవితం ప్రసాదించాలని భావించారు.

    పంచాయతీలో తీర్మానం

    ఉత్తరప్రదేశ్లో ఎలాంటి పని చేయాలన్నా పంచాయతీ తీర్మానం తప్పనిసరి. ఇందులో భాగంగానే సోనీ శర్మకు, బాలేంద్ర యాదవ్ కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో పంచాయతీ పెద్దలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో వారిద్దరిని స్థానిక గురుకుల పీజీ కళాశాల ప్రిన్సిపాల్ జై ప్రకాష్ సాహి గ్రామానికి రప్పించారు. అనంతరం గ్రామంలో ఉన్న శివాలయంలో పెళ్లి జరిపించారు. అంతేకాదు వారిద్దరికీ తన కాలేజీలో ఉద్యోగాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. వారితో పాటు ఆ పది మంది పిల్లలకు ఉచితంగా సౌకర్యం కూడా కలిపిస్తున్నట్టు ప్రకటించారు.ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.