Homeఎంటర్టైన్మెంట్Nagarjuna And Mahesh Babu: నాగార్జున, మహేష్ బాబు అంత యంగ్ గా కనిపించడానికి కారణం...

Nagarjuna And Mahesh Babu: నాగార్జున, మహేష్ బాబు అంత యంగ్ గా కనిపించడానికి కారణం తెలుసా? వారిద్దరి లైఫ్ స్టైల్ తెలిస్తే షాక్ అవుతారు

Nagarjuna And Mahesh Babu: వయసు పెరగడాన్ని ఎవరూ అంగీకరించలేరు. వృద్ధాప్యం దగ్గరపడుతున్న కొద్దీ అందం క్షీనిస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మునుపటి హుషారు, ఉత్సాహం ఉండదు. కాబట్టి ఎవరూ ఏజ్ పెరగాలని కోరుకోరు. సెలెబ్రిటీలు ఇందుకు భిన్నం. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వయసు పెరిగినా అది కనిపించకుండా, నిత్య యవ్వనంగా ఉండేలా చూసుకుంటారు. కెరీర్ పరంగా కూడా అది వాళ్లకు అవసరం.

టాలీవుడ్ లో ఇద్దరు హీరోలు చాలా ప్రత్యేకం. నాగార్జున, మహేష్ బాబు ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ హీరోలు. వీరిద్దరి గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాగార్జున ప్రస్తుత వయసు 65 ఏళ్ళు. ఆయన తోటి హీరోలైన చిరంజీవి, బాలకృష్ణలలో వృద్ధాప్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నాగార్జున మాత్రం స్టిల్ యంగ్ గా ఉన్నారు. ఫిట్నెస్ మైంటైన్ చేస్తున్నారు. ఇక ఈ తరం హీరోల్లో మహేష్ బాబు అందగాడు.

మహేష్ బాబును అందానికి కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. మహేష్ బాబు వయసు ఐదు పదులకు దగ్గరపడింది. శ్రీమంతుడు, మహర్షి సినిమాల్లో ఆయన కాలేజ్ స్టూడెంట్ పాత్ర కూడా చేశారు. అయినప్పటికీ ప్రేక్షకులు అంగీకరించారు. అందుకు కారణం ఆయన గ్లామర్. మహేష్ బాబు ఎప్పటికీ స్టూడెంట్ పాత్రలకు సెట్ అవుతారు. ఆయన లుక్, గ్లామర్ అలాంటిది మరి.

కాగా వీరిద్దరి గ్లామర్ రహస్యం ఏమిటీ? వయసును ఎలా అరెస్ట్ చేస్తున్నారు? అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఓ సందర్భంలో నాగార్జున తన గ్లామర్ రహస్యం బయటపెట్టారు. అందరూ అనుకుంటున్నట్లు నాగార్జున ఎలాంటి డైటింగ్ చేయరు అట. నచ్చిన ఫుడ్ కడుపునిండా తింటాడట. కాకపోతే ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఫాలో అవుతారట. ఉదయాన్నే వ్యాయామం చేయడం వలన మెటబాలిజం(జీర్ణక్రియ) పెరుగుతుంది. అది రోజంతా కంటిన్యూ అవుతుంది.

శరీరంలోని అదనపు కేలరీలను కరిగిస్తూ ఉంటుందని నాగార్జున అన్నారు. రాత్రి 7 గంటలకల్లా డిన్నర్ పూర్తి చేస్తారట. బ్రౌన్ రైస్ తింటారట. భోజనంలో మూడు ఆకుకూరలు ఉండేలా చూసుకుంటారట. ఫిష్, చికెన్ సైతం తింటారట. ఇక ప్రతిరోజూ రాత్రి స్వీట్ తినాల్సిందే అట. స్వీట్ తినకుండా ఆయనకు నిద్రపట్టదు అట. నెయ్యి కూడా తింటానని నాగార్జున చెప్పుకొచ్చారు. కడుపును మాడ్చను. ఆకలి తీరా తింటానని చెప్పుకొచ్చారు.

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే… ఆయన బ్యూటీ సీక్రెట్ మితంగా తినడమేనట. నీకు ఇష్టమైనది ఏదైనా తిను. కానీ మితంగా తినాలి. అతిగా తినకూడదని ఆయన అన్నారు. నేను ఏదైనా సరిపడా తింటాను. పరిమితికి మించి తినను. అదే నా యవ్వనం రహస్యం అని చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular