https://oktelugu.com/

Nagarjuna: ఆ హీరోయిన్ నాకు షూటింగ్ లొకేషన్ లో నరకం చూపించింది..తట్టుకోలేక చీవాట్లు పెట్టాను : అక్కినేని నాగార్జున

ఒక హీరోయిన్ మాత్రం నాగార్జున కి క్రమశిక్షణ విషయం లో చాలా చిరాకు రప్పించిందట. గతం లో నాగార్జున ఈటీవీ లో ఛానల్ ప్రముఖ సీనియర్ హీరోయిన్ జయప్రద వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'జయప్రదం' అనే టాక్ షోకి ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 14, 2024 / 09:38 PM IST

    Nagarjuna(9)

    Follow us on

    Nagarjuna: మన టాలీవుడ్ లో మనసులో ఉన్న మాటలను నిర్మొహమాటంగా కుండలు బద్దలు కొట్టేలా ధైర్యంగా మాట్లాడే హీరోలలో ఒకడు అక్కినేని నాగార్జున. ఆయన మాటలు ఎదుటి వారిని నొప్పించేలా ఉండవు, చాలా సున్నితంగా తన మనసులోని భావాలను వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఇక ఆయనతో కలిసి పని చేసేంత సౌకర్యం, ఏ హీరోతో కూడా ఉండదు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే మాట. సినిమాకి పని చేసే దర్శకుడు, హీరోయిన్, క్యారక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుండి, జూనియర్ ఆర్టిస్టుల వరకు ప్రతీ ఒక్కరిని ఆయన షూటింగ్ స్పాట్ లో నవ్వుతూ పలకరించేవాడు. అంతే కాదు క్రమశిక్షణ విషయంలో కూడా నాగార్జున చాలా పకడ్బందీగా ఉంటాడు. 10 గంటలకు షూటింగ్ అని డైరెక్టర్ చెప్తే, గంట ముందే ఆయన లొకేషన్ లో ఉంటాడు. నాగార్జున క్రమశిక్షణ చూసి ఆ సినిమాలో పనిచేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యవహరించేవాళ్ళు.

    అయితే ఒక హీరోయిన్ మాత్రం నాగార్జున కి క్రమశిక్షణ విషయం లో చాలా చిరాకు రప్పించిందట. గతం లో నాగార్జున ఈటీవీ లో ఛానల్ ప్రముఖ సీనియర్ హీరోయిన్ జయప్రద వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘జయప్రదం’ అనే టాక్ షోకి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ టాక్ షో లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. జయప్రద ఈ షోలో నాగార్జున ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు పని చేసిన హీరోయిన్స్ లో మీకు బాగా లేజీ అనిపించిన హీరోయిన్ ఎవరు?’ అని అడగగా, నాగార్జున దానికి సమాధానం ఇస్తూ ‘శ్రీయా..ఈమె చాలా లేజీగా ఉంటుంది. కెమెరా ఆన్ చేస్తే చాలా చలాకీగా నటిస్తుంది, డ్యాన్స్ చేస్తుంది కానీ, మిగిలిన విషయాల్లో చాలా లేజీ గా ఉండడాన్ని నేను గమనించా. ఆమెతో కలిసి నేను నాలుగు సినిమాలు చేశాను. ఒక్క సినిమా షూటింగ్ లో కూడా ఆమె సమయానికి స్పాట్ కి రావడం నేను చూడలేదు. నాకు చిరాకు వేసి ఎన్నోసార్లు చివాట్లు కూడా పెట్టాను’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

    నాగార్జున శ్రీయ తో కలిసి సంతోషం, నేనున్నాను, బాస్ మరియు మనం వంటి చిత్రాలు చేసాడు. వీటిల్లో బాస్ చిత్రం తప్ప, మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. శ్రీయ లో ఆ ఒక్క లక్షణమే తనకు నచ్చదని, వర్క్ విషయం లో మాత్రం తన 100 శాతం ఇవ్వడానికి చాలా కష్టపడుతుందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇక నాగార్జున ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే రజినీకాంత్ – లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కూలీ’ అనే చిత్రంలో నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ఆయన ధనుష్ తో కలిసి ‘కుభేరా’ అనే చిత్రం లో కూడా నటిస్తున్నాడు. వీటితో పాటు ఆయన బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.